గ్రూప్-1 అభ్యర్థులకు మాక్ ఇంటర్వ్యూ

గ్రూప్-1 అభ్యర్థులకు “మనటివి” మాక్ ఇంటర్వ్యూ
• ఆదివారం ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు
• ఐదుగురు సభ్యలతో బోర్డు ఏర్పాటు
• అభ్యర్థులు శుక్రవారం లోపు నమోదు చేసుకోవాలి
• మనటివి వెబ్ సైట్లో దరఖాస్తులు
• సీఈఓ శైలేష్ రెడ్డి.
(సాఫ్ట్ నెట్-మనటివి)
గ్రూప్-1 అభ్యర్థులకు మనటివి మాక్ ఇంటర్వూ నిర్వహించాలని నిర్ణయించింది. నిర్వహించిన ఇంటర్వూని మనటివి చానళ్ళతో పాటు సోషల్ మీడియాలో ప్రసారం చేయనుంది.మనటివి-సాఫ్ట్ నెట్ సీఈఓ ఆర్.శైలేష్ రెడ్డి ఈ మేరకు ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు త్వరలో ఇంటర్వూ నిర్వహించనున్న దృష్ట్యా, అభ్యర్థుల అవగాహన కోసం మనటివి మాక్ ఇంటర్వూ కార్యక్రమం ఏర్పాటు చేసిందని సీఈఓ శైలేష్ రెడ్డి తెలిపారు. ఈ నెల 25వ తేది ఆదివారం రోజు జరిగే మాక్ ఇంటర్వూకు హాజరుకావాలనుకున్న అభ్యర్థులు శుక్రవారం సాయంత్రం లోపు మనటివిలో నేరుగా నమోదు చేసుకోవచ్చని లేదా మనటివి వెబ్ సైట్ softnet.telangana.gov.inలోని దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకుని feedback-softnet@telangana.gov.in ద్వార కూడా పేర్లను నమోదు చేసుకోవచ్చని సీఈఓ తెలిపారు.అభ్యర్థులు గ్రూప్-1 పరీక్షలో ఉతీర్ణత పొంది, టిఎస్పిఎస్సి నిర్వహించే ఇంటర్వ్యూకి అర్హత సాధించిన వారై ఉండాలన్నారు. ఐదుగురు వివిధ రంగాల అనుభవజ్ఞులను బోర్డుగా ఏర్పాటు చేసి మనటివి ఈ మాక్ ఇంటర్వూని నిర్వహించబోతుందని సీఈఓ వెల్లడించారు. ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగే మనటివి మాక్ ఇంటర్వూ కార్యక్రమాన్ని మనటివి చానల్స్, సోషల్ మీడియా లో ప్రసారం చేయనున్నామని చెప్పారు. మాక్ ఇంటర్వూ పై సందేహాలకు మనటివి హెల్ప్ లైన్ నెంబర్స్ 9394486053, 7337558051 కాల్ చేయవచ్చని శైలేష్ రెడ్డి సూచించారు.