మీడియా ముందుకు ప్రణయ్ హత్యకేసు నిందితులు

0
80
miryalaguda murder

సంచలనం రేపిన మిర్యాలగూడ పరువు హత్య కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రంగనాథ్ మీడియాకు వివరించారు. ఈ హత్య కేవలం వ్యక్తిగత కక్షల వల్లే జరిగిందని, హతుడు ప్రణయ్ ను అతని మామ మారుతీ రావు కిరాయి హంతకులతో హత్య చేయించినట్టు ఆయన తెలిపారు. తన కూతురు అమృత తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందనే కక్షతోనే మారుతీ రావు ఈ హత్య చేయించాడని ఆయన చెప్పారు. బీహార్ లో సమస్తీపూర్ కు చెందిన సుభాష్ శర్మ ప్రణయ్ ను హత్య చేసినట్టు ఆయన వెల్లడించారు.
ఈ కేసుతో సంబంధించి అరెస్టయిన వారిలో అమృత తండ్రి మారుతీ రావు, ఆయన సోదరుడు శ్రవణ్, హత్యకు పాల్పడిన సుభాష్ శర్మ, మహ్మద్ బారీ, అస్గర్ అలీ, అబ్దుల్ కరీం, మారతీ రావు డ్రైవర్ శివ లు ఉన్నారు. వీరిలో సుభాష్ శర్మ మినహా మిలిగిన వారందరినీ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. పోలీసుల కథనం ప్రకారం మిర్యాల గూడకు చెందిన మారుతీ రావు కు పలు వ్యాపారులు ఉన్నాయి. ఆయన కుమారై అమృత తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రణయ్ ను పెళ్లి చేసుకోవడంతో తీవ్ర ఆగ్రహం చెందిన మారుతీ రావు ప్రణయ్ ను హత్యచేయించాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం సుపారీ గ్యాంగ్ లను సంప్రదించాడుు. ఇతనికి హైదరాబాద్ మలక్ పేటకు చెందిన మహ్మద్ బారీ, ఉగ్రవాద మూలాలున్న అస్గర్ ఆలీ, మిర్యాల కూడకు చెందిన కరీంలు సహకరించినట్టు పోలీసులు తెలిపారు. బారీ జైల్లో ఉన్నప్పుడు బీహార్ కు చెందిన సుభాష్ శర్మతో పరిచయం అయిందని చెప్పారు. ఆస్పత్రి వద్ద ప్రణయ్ ను నరికింది సుభాష్ శర్మ అని ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు. ప్రణయ్ ను హత్యచేసేందుకు ముందుగా రెండున్నర కోట్లను డిమాండ్ చేశారని చివరకు కోటి రూపాయలకు బేరం కుదరినట్టు ఎస్పీ వివరించారు.
ప్రణయ్, అమృత 9వ తరగతి నుండే ప్రేమించుకుంటున్నారని, హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనూ వీరి ప్రేమ వ్యవహారం కొనసాగిందని ఎస్పీ తెలిపారు. ఈ విషయం తెలిసిన అమృత తండ్రి పలు సార్లు కూతురుని మందలించాడని దీనితో ఇంజనీరింగ్ ను మధ్యలేనే ఆపేశారని తెలిపారు. జనవరి 30న ఇంటి నుండి పారిపోయి ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారని ఆ తరువాత అమృత గర్భందాల్చిందన్నారు. అమృతకు అభార్షన్ చేయించేందుకు మారుతీరావు చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ప్రణయ్ ను హత్యచేసేందుకు కోటి రూపాయల ఒప్పందం కుదుర్చుకుని 10 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చారన్నారు. ఆగస్టు 14వ తేదీ నుండే ప్రణయ్ ను హత్య చేసేందుకు ప్రయత్నించారని అయితే రెండు సార్లు కుదరలేదని ఆఖరికి సెప్టెంబర్ 14 ఆస్పత్రి వద్ద అతన్ని హత్య చేశారని ఎస్పీ వివరించారు. తొలుత బ్యూటీ పార్లర్ వద్ద ప్రణయ్ ను చంపాలనుకున్నా అతనితో పాటు సోదరుడు కూడా ఉండడంతో కుదరలేదని మరోసారి కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదన్నారు.
ఆస్పత్రి ముందు ప్రణయ్ ను హత్యచేసిన తరువాత హంతకుడు సుభాష్ శర్మ బెంగళూరుకు అటు నుండి పాట్నాకు వెళ్లాడని అక్కడే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. హత్య జరిగిన ప్రాంతంలో అస్ఘర్ కూడా ఉన్నాడని అతనే సుభాష్ కు సూచనలు చేశాడని, హత్యకు రెండు గంటల ముందు మారుతీ రావు నల్గొండకు వచ్చాడని ఆయన తెలిపారు. ఈ హత్యకు నయూం ముఠాకు సంబంధం లేదని అన్నారు. అమృత తల్లికి హత్యకు సంబంధించిన కుట్ర తెలియదని ఆయన స్పష్టం చేశారు.

అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా:రాహుల్ గాంధీ

Wanna Share it with loved ones?