వారితో జరిపే శృంగారం అత్యాచారంతో సమానం

మైనర్టీ తీరని బాలికలతో జరిపే ఎటువంటి లైంగిక చర్య అయినా అత్యాచారంతో సమానమేనని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. మైనర్ భార్యతో జరిపే శృంగారం కూడా అత్యాచారం కిందికే వస్తుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మైనార్టీ తీరని బాలికల సమ్మతితో జరిపే శృంగారం కూడా అత్యాచారంగానే పరిగణించాలంటూ కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 15 సంవత్సరాలు నిండిన మైనర్ భార్యతో జరిపే శృంగారం అత్యాచారం కాదంటూ ఉన్న వెసులుబాటును కోర్టు తప్పుబట్టింది. బాల్య వివాహాలు నేరం అయినప్పుడు మైనర్ భార్యలతో జరిపే శృంగారం ఏవిధంగా న్యాయసమ్మతం అవుతుందని కోర్టు ప్రశ్నించింది.
భారత శిక్షా స్మృతి ప్రకారం మైనార్టీ తీరని బాలికలతో శృంగారం జరపడం నేరం అయినప్పటికీ 15 సంవత్సరాల భార్యతో జరిపే శృంగారం అత్యాచారం కిందకి రాదంటూ ఉన్న మినహాయింపుకు ఈ తీర్పుతో చెల్లు చీటీ ఇచ్చినట్టయింది. మైనర్ బాలికతో ఏ తరహాలో శృంగారం జరిపినా అది అత్యాచారం గానే పరిగణించాలని కోర్టు తన తీర్పులో స్ఫష్టంగా పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *