తెలంగాణ పారిపరిశ్రమాభివృద్ధి సంస్థకు చెందిన విజయ బ్రాండ్ పాల ధరను పెంచుతున్నట్టు ఆ సంస్థ తెలిపింది. లీటర్ కు ఏకంగా రెండు రూపాయలు చొప్పున ధరను పెంచుతున్నారు. విజయ బ్రాండ్ పాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అనేక ప్రైవేటు సంస్థలకు చెందిన పాలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నప్పటికీ విజయ బ్రాండ్ ను పెద్ద సంఖ్యలో వినియోగదారులు వాడుతున్నారు. ఇప్పుడు పాల ధరను లీటరుకు రెండు రూపాయల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. విజయ బాటలో ఇతర బ్రాండ్ లు తమ పాల ధరలను పెంచుతాయో లేదో చూడాలి.