మెట్రోలో మొదటి రోజు ప్రయాణికుల సందడి

0
67

హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడి చేతుల మీదుగా ప్రారంభం అయిన మెట్రో రైలు బుధవారం నుండి సాధారణ ప్రజానీకానికి అందుబాటులోకి వచ్చింది. కొత్తగా వచ్చిన మెట్రోలో ప్రయాణించేందుకు నగర ప్రజలు పోటీలు పడుతున్నారు. ఉదయం ఆరు గంటల నుండి సర్వీసులు మొదలు కాగా ఐదు గంటలకే కొంత మంది మెట్రో స్టేషన్లకు వచ్చేశారు. ప్రయాణానికి అవసరం అయిన స్మార్ట్ కార్డులు తీసుకున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఉదయం 5.00 గంటలకే స్మార్ట్ కార్డుల అమ్మకం ప్రారంభం అయింది. సుమారు లక్ష మంది బుధవారం నాడు మెట్రోలో ప్రయాణిస్తారని అంచానా.
తొలి రోజు ప్రయాణిస్తున్న వారు రైల్వే స్టేషన్ లలో, ట్రైన్ లలో సెల్ఫీలు తీసుకుంటూ హడావుడి చేస్తున్నారు. మొదటి రోజు మెట్రో ప్రయాణం చేయడం అనందంగా ఉందని పలువురు వ్యాఖ్యానించారు. మెట్రో రైలు చాలా బాగుందని ప్రయాణం చాలా సాఫీగా సాగిందని అంటున్నారు. మొదటి రోజే మెట్రోలో ప్రయామించడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. మొట్రోలో నుండి నగర అందాలను ఆస్వాదిస్తున్నట్టుగా చెప్పారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here