మొదలైన హైదరాబాద్ మెట్రో పరుగులు

0
54
The Prime Minister, Shri Narendra Modi inaugurating Hyderabad Metro, at Hyderabad on November 28, 2017. The Governor of Andhra Pradesh and Telangana, Shri E.S.L. Narasimhan, the Chief Minister of Telangana, Shri Chandrashekar Rao, the Minister of State for Housing and Urban Affairs (I/C), Shri Hardeep Singh Puri are also seen.

హైదరాబాద్ నగర చరిత్రలో మరో చారిత్రాత్మక ఘట్టం. నగర ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోడి ప్రారంభించారు. తెలంగాణ గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర ప్రముఖుల సమక్షంగా మెట్రో రైలును ప్రధాని జాతికి అంకితం చేశారు. మెట్రో రైలుతో పాటుగా టీ-సవారీ యాప్, బ్రోచర్ లను కూడా మోడి ఆవిష్కరించారు. బేగంపేట విమానాశ్రయం నుండి హెరికాఫ్టర్ లో మియాపూర్ కు చేరుకున్న ప్రధాని అక్కడ ముందుగా మెట్రో పైలాన్ ను ఆవిష్కరించారు. మియాపూర్ నుండి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా పలువురు ప్రముఖులతో కలిసి ఆయన మెట్రోలో మియాపూర్ నుండి కూకట్ పల్లి వరకు ప్రయాణించి తిరిగి మియాపూర్ కు చేరుకున్నారు. మెట్రోకు నిర్మాణానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఆడియో విజువల్ ను ప్రధాని తిలకించారు.
మెట్రో రైలు బుధవారం ఉదయం నుండి ప్రజలకు అందుబాటులోకి రానుంది. తొలి దశలో నాగోల్ ముండి మియాపూర్ వరకు మెట్రో రైలు నడవనుంది.ఉదయం ఆరు గంటల నుండి రాత్రి 10.00 గంటల వరకు మెట్రో రైలును నడపనున్నారు. ప్రస్తుతం ప్రతీ 15 నిమిషాలకు ఒక రైలు ను నడపనున్నట్టు అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ఎక్కువ రైళ్లను నడపనున్నారు. ఎల్బీనగర్ నుండి రాయదుర్గం మార్గాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here