రెండు గంటల పాటు నిల్చిపోయిన మెట్రోరైలు

0
64

హైదరాబాద్ మెట్రోరైలుకు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీనితో ఆదివారం నాడు రెండు గంటల పాటు మెట్రో సేవలు నిల్చిపోయాయి. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మెట్రో రైలు ఎక్కేందుకు వచ్చారు. రెండు గంటల పాటు మెట్రో సర్వీసులు నిల్చిపోవడంతో మెట్రో స్టేషన్ లలో రద్దీ ఏర్పడింది. సాంకేతిక సమస్య వల్ల ఓ రైలు అమీర్ పేట స్టేషన్ లో ఆగిపోయింది. ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయాయి. అమీర్ పేటలో నిల్చిపోయిన రైలును ప్రకాశ్ నగర్ కు తరలించారు. అక్కడ ఉన్న అదనపు ట్రాప్ పై ఉంచడంతో రైళ్ల రాకపోకలకు మార్గం సుగమం అయింది.
అమీర్ పేటలో ఆగిపోయిన రైలును ప్రకాశ్ నగర్ కు తరలించడం , రైళ్లను పునరుద్దరించడానికి రెండు గంటల సమయం పట్టింది. ఇటీవలే ప్రారంభమైన మెట్రో రైలులో సాంకేతిక సమస్యలు రావడం ఇదే మొదటిసారి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మెట్రో రైలులో ఏర్పడిన సాంకేతిక సమస్య ఎందుకు ఏర్పడింది. రానున్న రోజుల్లో ఇటువంటి సమస్యలను ఎట్లా ఎదుర్కొవాలనేదానిపై మెట్రో అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here