ప్రేమ మూర్తి పశువుల పాకలో ఎందుకు పుట్టాడు

పశువల పాకలో పుట్టిన ఆ ప్రేమ మూర్తి లోకానికి అంతటికీ వెలుగును నింపాడు. జనుల పాపాలను తొలగించడం కోసం తాను శిలువనెక్కాడు. ప్రపంచానికి ప్రేమను పంచిన ఆ కరుణామయుడు లోపాన్ని పాలిస్తూ తన కరుణా కటాక్షాలతో ప్రజలను దీవిస్తున్నాడు. అసలు ఏసు ప్రభువు తన జననానికి పశువుల పాకనే ఎందుకు ఎంచుకున్నాడు. ఈ లోకంలోకి అడుగిడనున్న లోక రక్షకుడికి, ప్రేమ స్వరూపికి అప్పుడు చోటు దొరకలేదు. ఆయన తల్లిదండ్రులకు ఒక పశువులశాల కనిపించింది. శిశువుగా ఉన్న ప్రభువును పడుకోబెట్టేందుకు ఆ మాతృమూర్తికి ఆ పాకలో ఒక తొట్టె కనిపించింది. అక్కడే గుడ్డలతో చుట్టి క్రీస్తును పడుకోబెట్టారు.ఈ సంఘటనను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? మానవ హృదయం ఒక నివాస స్థలం అనుకుంటే, అది పశువులశాలలా అపరిశుభ్ర వాతావరణంలో ఉంది. క్రీస్తుప్రభువు తాను జన్మించే చోటును అక్కడే వెతుక్కున్నాడు. మానవ హృదయాల్ని పరిశుద్ధపరచి వారిని మహోన్నతులుగా చేసేందుకే ఆయన ఈ లోకంలోకి వచ్చాడని, పశువుల పాకలోని జన్మ వృత్తాంతం మనకు తెలియజెబుతోంది. పశువుల పాలకో జన్మించిన ఆ ప్రేమ మూర్తి తత్వాన్ని అర్థం చేసుకుంటే అంతకన్నా కావాల్సింది ఏముంది.
(అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు)
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *