ఆ పాపం తెలుగు సీరియళ్లదే : నన్నపనేని రాజకుమారి

0
104
నన్నపనేని రాజకుమారి

మగవాళ్లపై ఆడవారు చేస్తున్న దాడులు పెరిగిపోతున్నాయని ఈ క్రమంలో పురుషుల కమిషన్ ను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చేట్టుందని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. తాను ఈ వ్యాఖ్యలు నవ్వులాటకు చేయడం లేదని నిజంగానే పురుష కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్టు చెప్పారు. భార్యల చేతుల్లో హతమవుతున్న భర్తల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందని ఆమె తెలిపారు.
ఉత్తరాంధ్రలో జరిగిన రెండు ఘటనలను ప్రస్తావించిన రాజకుమారి ఈ రెండు ఘటనల్లోనూ వివాహేతర సంబంధాల మోజులో పడి భర్తలపై దాడులు చేస్తున్నారని అన్నారు. ఇటువంటి ఘటనల్లో భాదిత పురుషులను కూడా పరామర్శించనున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఇటువంటి అనర్థాలకు ప్రధాన కారణం తెలుగు సీరియల్స్ అని నన్నపనేని రాజకుమారి దుయ్యబట్టారు. పలు టీవీల్లో ప్రసారం అవుతున్న తెలుగు సీరియల్స్ ను చూసి మహిళలు నేరస్థులుగా మారుతున్నారని ఆమె చెప్పారు.
కుట్రలు కుతంత్రాలతో నిండిపోయిన సీరియళ్లను చూడడం వల్లే మహిళలకు ఇటువంటి క్రూరమైన ఆలోచనలు వస్తున్నాయని అన్నారు. ప్రతీ సీరియల్ లోనూ అక్రమసంబంధాలు, హత్యా ప్రయత్నాలు, హత్యలకు కుట్రలు వంటి దారుణాలు చూపిస్తున్నారని వీటిని చూసి ప్రేరణ పొంది ఇటువంటి ఘాతకాలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. ప్రతీ తెలుగు సీరియల్ ఇదేవిధంగా తయారయ్యాయని అన్నారు. వాటిని తీస్తున్న వారితో పాటుగా చూస్తున్న వారిది కూడా తప్పే అన్నారు.
మహిళలను వక్రమార్గంలోకి మళ్లిస్తున్న సీరియళ్లపై ఖచ్చితంగా నియంత్రణ ఉండాల్సిందే అన్నారు. దీనికోసం గాను ఒక సెన్సార్ విధానాన్ని అమలు చేయాలని నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేశారు. సీరియళ్లకు సంబంధించి సెన్సార్ విధించాలని గతంలోనే ప్రధాన మంత్రి కార్యాలయానికి నివేదించినట్టు ఆమె వివరించారు. అయితే సినిమాలకు సెన్సార్ వర్తించినట్టుగానే సీరియల్స్ కు వర్తించదని ప్రధాని కార్యాలయం నుండి తనకు లేఖ అందినట్టు ఆమె చెప్పారు. గతంలో ఈ విధానం లేనప్పటికీ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అనర్థాలకు ప్రధాన కారణంగా మారుతున్న సీరియల్స్ పై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
టీవీల్లో ప్రసారం అవుతున్న సీరియళ్లతో పాటుగా వాట్సప్, ఫేస్ బుక్, యూట్యూబ్ ల నిండా ఆశ్లీల దృశ్యాలు చాలా ఎక్కువయ్యాయని అన్నారు. వాటిని చూసి చిన్న పిల్లలు సైతం పెడ మార్గాలు పడుతున్నారని అన్నారు. ఇటీవల చిన్నారులపై జరిగిన అత్యాచార యత్నం కేసుల్లో నిందితులుగా ఉన్న మైనార్టీ బాలురను విచారించినపుడు ఈ విషయాలు వెల్లడైనట్టు ఆమె వివరించారు. పిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తున్న పెద్దలు వాటిలో వారేం చూస్తున్నారనే విషయాన్ని పట్టించుకోవడం మానేశారని దీని వల్ల తెలిసీ తెలియని వారు చేస్తున్న చేష్టల వల్ల వారితో పాటుగా వారి తల్లిదండ్రులు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఇంటర్నెట్ లలో వస్తున్న అశ్లీల దృశ్యాలపై నియంత్రణ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇటు సీరియళ్లు, అటు ఇంటర్నేట్ లు ప్రజలను తప్పదేవ పట్టిస్తున్నాయని అన్నారు. వీటిపై సరైన నియంత్రణ లేకుండా సమాజం మరింత బ్రష్టుపట్టడం ఖాయమన్నారు.
nannapaneni raja kumari, raja kumari on telugu serials.

గుడ్డిగా నమ్మి… నగ్న చిత్రాలు తీయించుకుని…


పెట్రోలు ధర పైసా తగ్గింది… పండగ చేస్కోండి…
https://en.wikipedia.org/wiki/Nannapaneni_Rajakumari

Wanna Share it with loved ones?