February 28, 2020

హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా

mega job mela హైదరాబాద్ లో భారీ ఉద్యోగ మేళా జరగనుంది. నారాయణగూడ కేశవమెమోరియల్ కామర్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఆదివారం సెప్టెంబర్ 2వతేదీన ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. www.telanganaexams.com సహకారంతో ప్రఖ్యాత లగుఉద్యోగ్ భారతీ, ఐస్కిల్స్ హెచ్ఆర్ డీ ప్రవేట్ లిమిటెడ్ లు సంయుక్తంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నాయి. ఉదయం 9.00 నుండి 3.00 గంటలవరకు రిజిస్టేషన్లు జరుగుతాయని, ఈ జాబ్ మేళాకు హాజరయ్యేవారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. వివిధ రంగాలకు చెందిన 50 కంపెనీలు ఈ జాబ్ మోళాకు హాజరవుతున్నాయని ఇందులో 2వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు వారు వివరించారు.
ఐటీ రంగంతో పాటుగా కోర్ ఇండ్రస్ట్రీకి చెందిన ఉద్యోగాలు కూడా అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. సాధారణంగా జాబ్ మోళాల్లో కేవలం కొన్ని రంగాలకు చెందిన ఉద్యోగాలకు మాత్రమే అవకాశం ఉండేదని అయితే తాము మాత్రం అన్ని రంగాలకు చెందిన వారికి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్టు వారు వివరించారు. జాబ్ మేళాకు హాజరయ్యేవారు ఐదు సెట్ల రెజ్యూమోలతో పాటుగా ఐదు పాస్ పోర్ట్ సైజు ఫొటోలను కూడా తీసుకునిరావాలని, ఇతర వివరాలకు www.iskillhrd.com వెబ్ సైట్ ను సందర్శించాలని వారు తెలిపారు.

పంచాయతీ కార్యదర్శి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల


తెలంగాణలో కొత్త జోన్లు ఇవే | new zones in telangana