మసూద్ అజార్ మృతి?

0
75

కరడుగట్టిన ఉగ్రవాది… జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని అధికారికంగా ఇంకా ఎవరూ దృవీకరించడం లేదు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని బాలాకోట్ లోని తీవ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడుల్లో మసూద్ అజార్ తీవ్రంగా గాయపడ్డాడని ఆ తీవ్రవాదిని పాకిస్థాన్ కు చెందిన ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స జరుపుతున్న సమయంలో ముఠానేత చనిపోయినట్టు అనధికార వర్గాల సమాచారం.
మరోవైపు తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ మసూద్ అజార్ చనిపోయాడనే వార్తలు బయటికి వస్తున్నాయి. అయితే వీటికి సంబంధించి అధికార వర్గాల నుంచి మాత్రం ఎటువంటి స్పందన రావడం లేదు. భారత్ లో ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను నడిపిస్తున్న మసూద్ అజార్ కోసం భారత్ కొద్ది రోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
అటు మసూద్ అజార్ తమ దేశంలోనే ఉన్నాడనే విషయాన్ని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖురేషీ కూడా దృవీకరించిన సంగతి తెలిసిందే. జైషే మహ్మద్ చీఫ్ తమ దేశంలోనే ఉన్నాడని అయితే తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించిన ఒక రోజులోనే మసూద్ అజార్ కు సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి.

Wanna Share it with loved ones?