హైదరాబాద్ లో ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్ పరుగు ఉత్సాహంగా జరిగాయి. ఉదయం 5.00 గంలకో పరుగు పందాలు ప్రారంభమయ్యాయి. 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్ ను నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ప్రారంభించగా 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ ను జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి ప్రారంభించారు. నెక్లెస్ రోడ్డు లోని పూపల్స్ ప్లాజా వద్ద ప్రారంభమైన మారథాన్ ఖైరతాబాద్ ఫ్లైఓవర్, రాజ్ భవన్ సర్కిల్, పంజాగుట్ట, బంజారాహిల్స్,హైటెక్ సిటీ వరకు సాగింది. ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ ఈ మారథాన్ ను నిర్వహించింది. పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రతీ ఒక్కరూ నడక, పరుగును అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రంలో పాల్గొన్న అతిధులు కోరారు. మంచి ఆరోగ్యానికి ఇటువంటి కార్యక్రమాలు దోహద పడతాయని అన్నారు. నగరంలో మారథాన్ పోటీలను తరచూ నిర్వహిస్తే బాగుంటుందని సాఫ్టవేర్ ఉద్యోగి నందిగామ చంద్రశేఖర్ అభిప్రాయ పడ్డారు.