ఎన్ కౌంటర్లో12మంది మావోయిస్టులు మృతి| 12 killed in encounter

తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో 12 మంది మావోయిస్టులు చనిపోగా ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులకు గాయాలు అయ్యాయి. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపూరం మండంలోని తడపలగుట్ట సమీపంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ గ్రామానికి సమీపంలోనే ఛత్తీస్ ఘడ్ లోని పూజారికాంకేడు ఉంది. కాల్పులు జరిగిన ప్రాంతం తెలంగాణకు చెందినదిగా మొదట వార్తలు వచ్చినప్పటికీ చత్తీస్ ఘడ్ భూబాగంలోనే ఎన్ కౌంటర్ జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఎన్ కౌంటర్ లో చనిపోయిన వారిలో మావోయిస్టుల అగ్రనేత హరిభూషణ్ ఉన్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ దీన్ని అధికారికంగా ఇంకా వెల్లడించాల్సి ఉంది.
మావోయుస్టులు ఎక్కవగా సంచరించడంతో పాటుగా వారి ప్రాబల్యం ఎక్కువగా ఉండే పూజారికాంకేడు ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం నిర్వహిస్తున్నట్టు అందిన సమాచారంతో పోలీసులు ఈ ప్రాంతంలో గాలింపు జరుపుతుండగా మావోలు తారసపడ్డారని అక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మరణించినట్టు పోలీసులు చెప్పారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశం నుండి తూపాకులతో పాగుటా ల్యాప్ టాప్, స్కానర్, నగదును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ పోలీసులు సంయూక్తంగా ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్నట్టు పోలీసులు తెలిపారు.
12 left-wing extremists were killed in an encounter. one Commando who was injured in the encounter died later in hospital. large cache of arms and ammunition including one AK-47 recovered by police at encounter site.
Police are yet to identify the other extremists.
ఎన్ కౌంటర్
ఎన్ కౌంటర్-మావోయిస్టులు
Maoist
Maoist ganapathy
Communist_party
Social_democracy


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *