ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్న కేంద్రం : మన్మోహన్ సింగ్

కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతోందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శించారు. ఆర్థిక విధానాల రూపకల్పన, అమలు విషయంలో నరేంద్ర మోడీ సర్కారు పూర్తిగా విఫలం అయిందని ఆయన దుయ్యబట్టారు. నరేంద్ర మోడీ సర్కారు తీసుకున్న రెండు తప్పుడు నిర్ణయాల వల్ల దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిందని ఆయన ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దుతో పాటుగా జీఎస్టీ అమలు విషయంలోనూ నరేంద్ర మోడీ పూర్తిగా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారని మన్మోహన్ సింగ్ అన్నారు.
పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడంతో పాటుగా దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై విపరీతంగా పడిందన్నారు. ముందస్తు ప్రణాళిక, సన్నద్దత లేకుండానే ఇంత పెద్ద నిర్ణయాన్ని నరేంద్రమోడీ సర్కారు తీసుకుందని దీని వల్ల ప్రజలు అనేక అగచాట్లు పడాల్సివచ్చిందని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల కేవలం నగదు కొరతతో పాటుగా ఆర్థిక రంగ ప్రగతికి కూడా అవరోధంగా మారిందన్నారు.
అదేవిధంగా జీఎస్టీ విషయంలోనూ మోడీ సర్కారు దుందుడుకుగా వ్యవహరించిందన్నారు. అసలు జీఎస్టీపై అధికారులకే పూర్తిగా అవగాహన లేదని ఈ చట్టాన్ని కూడా ఆదరాబాదార అమల్లకి తీసుకుని వచ్చారని అన్నారు. జీఎస్టీ వల్ల చిన్న చిన్న వ్యాపారులు నష్టపోయారని వారి వ్యాపారాలు మూతపడ్డాయని చెప్పారు. మధ్యతరహా పరిశ్రమలు సైతం మూసివేశారని దీని వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు మారారని మన్మోహన్ సింగ్ విమర్శించారు. ఎటువంటి కసరత్తులు చేయకుండానే జీఎస్టీని అమలు చేశారని ఆయన మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం విధానాల కారణంగా బ్యాంకింగ్ రంగం కుదేలయిందన్నారు. ఆర్థిక నిర్వహిణ తీరు ఏమాత్రం సరిగా లేదని అసలు బ్యాంకింగ్ రంగంపై ప్రజలకు నమ్మకం పోయేట్టుగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయన్నారు. ప్రజల్లో బ్యాంకింగ్ రంగంపై నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందని లేని పక్షంలో ఆర్థిక రంగం మరింత కుదేలవుతుందన్నారు. ప్రజలకు బ్యాకింగ్ పై నమ్మకం పోతే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఒంటెద్దు పోకడలతో ముందుకు పోతోందని మాజీ ప్రధాని తీవ్రంగా విమర్శించారు. ఆర్థిక రంగంపై పట్టును ప్రభుత్వం పూర్తిగా కోల్పోయిందని దీనివల్ల అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. ఈ విషయం పై ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు హెచ్చరించినా ఫలితం కనిపించడంలేదని ఆయన తెలిపారు. నరేంద్ర మోడీది కేవలం మాటలు చెప్పే ప్రభుత్వం గానే మిగిలిపోయిందని ఆయన విమర్శించారు.
manmohan singh, ex prime minister manmohan singh, narendra modi, central government, economics, demonetisation , gst, gst bill, central gst, gst rules, banking, national banks, bank loans, bank loans in India, banking sector, manmohan singh about economics, manmohan singh about banking, bank rules, bank employees, dr manmohan singh, finance minister.

కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ఇంజనీరింగ్ అద్భుతం


/vijay-sampla/
Manmohan_Singh