లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహాన కార్యక్రమం

lions club of hyderabad blues …. భారతదేశంలో వివిధ రకాల క్యానర్లబారిన పడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ మహమ్మారిని మొదటిదశలోనే గుర్తిస్తే పూర్తిస్థాయిలో నివారించడం సాధ్యమవుతుంది. అయితే ప్రజల్లో వ్యాధిపట్ల అవహాన సరిగా లేకపోవడం వల్లే ఎక్కువ మంది దీనిబారిన పడుతున్నారు. ఈ క్రమంలో అటువంటి భయంకర వ్యాధిపట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటుగా కాన్సర్ పరీక్షలను నిర్వహించింది ” లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ బ్లూస్”. హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రి “కిమ్స్ ” సహకారంతో దిల్ షుఖ్ నగర్ పీ అండ్ టీ కాలనీ సంక్షేమ సంఘ భవనంలో ఏర్పాటయిన అవహాగాన సదస్సుకు పెద్ద సంఖ్యలో స్థానికులు హాజరయ్యారు.
కిమ్స్ కు చెందిన వైద్యుల బృందం వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటుగా కాన్సర్ లక్షణాలను, ఈ వ్యాధి ఎట్లా వస్తుందనే విషయంపై ప్రజలకు వివరించారు. క్యాన్సర్ ను తొలిదశలోనే గుర్తిస్తే పూర్తి స్థాయిలో నయం చేయడం సాధ్యమవుతుందని చెప్పారు. ప్రజలు ఎటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని వ్యాధిపై సరైన అవగాహాన లేనిందుకు వల్లే సమస్యలు వస్తున్నాయని అన్నారు. కాన్సర్ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ కు చూపించుకోవాలన్నారు.
శరీరంలో ఎక్కడైనా అసాధారణంగా కనిపించే గడ్డలు, చర్మం పైన ఉండే మచ్చలలో మార్పులు కనిపించడం, వాటి పరిమాణం పెరగటం, రంగులో మార్పు, దురదలు, రక్తస్రావం వంటి లక్షణాలు. ఆహారం జీర్ణం కావడంలో విపరీతమైన సమస్యలు, అఖస్మాత్తుగా బరువులో తేడాలు వంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ను సంప్రదించాలన్నారు.
లయన్స్ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ ఎం ప్రకాశరావు, ఎం.నాగరాజు ” లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ బ్లూస్” కు చెందిన జీవీఎన్ రాజు, కే.సత్యనారాయణలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

దేశానికే ఆదర్శం – తెలంగాణ రాష్ట్రం


వాడవాడలా ఎగిరిన మువ్వన్నేల జెండా
.cancer symptoms