వాజ్ పేయి సంస్మరణ సభలో ఏంటానవ్వులు

0
44
laughing at vajpayee ceremony

laughing at vajpayee ceremony మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి సంస్మరణ సభలో ఇద్దరు బీజేపీ మంత్రులు వ్యవహరించిన తీరు వివాదాస్పదం అయింది. వాజ్ పేయి అస్థికలను దేశంలోని పలు నదుల్లో నిమజ్జనం చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక చోట్ల సంస్మరణ సభలు నిర్వహిస్తున్నారు. చత్తీస్ గఢ్ లో నిర్వహించిన సభలో ఆ రాష్ట్ర మంత్రులు బ్రిజ్ మోహన్ అగర్వాల్, అజయ్ చంద్రకర్ లు వ్యవహించిన తీరును పలువురు తప్పుబడుతున్నారు. ముఖ్యమంత్రి రమణ్ సింగ్ వేదికపై ఉండగానే ఇద్దరు మంత్రులు జోకులేకుంటూ పెద్ద ఎత్తున నవ్వడం, ఒక మంత్రిగారైతే బల్లమీద చేత్తో చరుస్తూ పెద్ద పెట్టున నవ్వడం చర్చనీయాంశమైంది.
వ్యవసాయ మంత్రి బ్రిజ్‌మోహన్‌ అగర్వాల్‌, ఆరోగ్యశాఖ మంత్రి అజయ్‌ చంద్రకర్‌లు వ్యవహరించిన తీరును పలువురు తప్పబడుతున్నారు. మహానాయకుడి సంస్మరణ సభలో మంత్రులు ఈ విధంగా వ్యవహరించడం దారుణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రుల వ్యవహారానికి సంబంధించిన వీడియో ఇప్పుుడు వైరల్ గా మారింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ధరమ్ లాలా కౌశిక్ వారిస్తున్నా వినకుండా ఇద్దరు మంత్రులు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ గొప్ప నాయకుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అని పలువురు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. వాజ్ పేయి బతికున్నప్పుడూ కూడా ఆయన్ను విస్మరించిన బీజేపీ ఇప్పుడు ఆయన పట్ల గౌరవం చూపుతున్నట్టు నాటకాలు చేస్తోందనన్నారు ఆ పార్టీ నేత శైలేశ్ నితిన్ త్రివేది. ఒక ముఖ్యనాయకుడిని బీజేపీ మంత్రులు ఇచ్చే గౌరవం ఎట్లాంటిదో తెలిసిపోయిందన్నారు. వాజ్ పేయి పట్ల గౌరవ మర్యాదలు ఉన్నట్టు ప్రజల ముందు ప్రజల ముందు ప్రదనర్శలు చేస్తున్న బీజేపీ అసలు రంగు ఇదేనని ఆయన దుయ్యబట్టారు.

ఉత్తమ ప్రధాని మోడీనే-రెండో స్థానంలో ఇందిరాగాంధీ


వాళ్లకే టికెట్లిస్తే మా పరిస్తితి ఏంటి -టీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి

Wanna Share it with loved ones?