వై.ఎస్.వివేక హత్యకు భూ లావాదేవీలే కారణం?

0
54

మాజీ మంత్రి, పార్లమెంటు మాజీ సభ్యుడు వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య రెండు తెలుగురాష్ట్రాల్లో ఇప్పుడో సంచలనంగా మారింది. ఈ హత్య పై ప్రస్తుతం రాజకీయ దూమారం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఏపీ ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ఇదో ప్రధాన ప్రచార అస్త్రంగా మారిపోయింది. తన చిన్నానని అధికార పక్షమే చంపేసిందని జగన్ అంటుండగా జగన్ కు సంబంధించిన వ్యక్తులే ఈ పనిచేశారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.
అసలు వివేకానంద రెడ్డిని ఎవరు చంపారనే అంశంపై పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాతకక్షలు, రాజకీయ వ్యవహారాల కన్నా ఆర్థిక అంశాలే హత్యకు ప్రధాన కారణాలుగు చెప్తున్నారు. వివేకాక అత్యంత సన్నిహితులుగా ఉన్న కొంద మంది పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా గంగిరెడ్డి, పాశం పరమేశ్వర్ రెడ్డి పేర్లతో పాటుగా పలువురి పేర్లు బయటికి వస్తున్నాయి. వీరిద్దరూ సూత్రధారులుగా కాగా చంద్రశేఖర్ కీలక పాత్ర వహించాడని సిట్ ప్రాధమిక అంచనాకు వచ్చింది.
ఇప్పటి వరకు 45మందిని సిట్ రహస్య ప్రాంతాలలో విచారణ చేసింది. హత్య జరిగిన రోజు పులివెందులలోని చిన్నా అనే వ్యక్తికి చెందిన స్కార్పియోలో చంద్రశేఖర్ తిరుగాడినట్లు సిపి ఫుటేజీలను దర్యాప్తు అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దేవిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు సిట్ మరో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
పరమేశ్వరరెడ్డి అనుచరులుగా భావిస్తున్న సింహాద్రిపురం మండలం కతనూరుకు చెందిన శేఖర్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌తో పాటు మరోఇద్దరిని సిట్ అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. విచారణలో భాగంగా వివేకా కాల్‌డేటాలోని మెసేజ్‌లను సిట్ దృష్టిసారించింది. హత్యకు కొన్ని రోజుల ముందు ‘బీకేర్ ఫూల్’ అంటూ ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ నుంచి మెసేజ్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మెసేజ్ ఎవరు పంపారు ? ఎందుకు పంపారనే దానిపై దృష్టి సారిస్తున్నారు. బెంగళూరులోని ఓ భూ వివాదంలో వివేకా, గంగిరెడ్డిల మధ్య వివాదం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. బెంగళూరులోని రూ.150 కోట్ల విలువ చేసే సెటిల్‌మెంట్ వ్యవహారంలో వివేకా అనుచరుల మధ్య గొడవలున్నట్లు సిట్ గుర్తించింది.
ఈక్రమంలో భూ వ్యవహారంలో 1.5కోట్ల మేరకు నగదు లావాదేవీల విషయంలో వివేకా, గంగిరెడ్డిల మధ్య వివాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వివేకా హత్య విషయంలో గండిరెడ్డి కీలక పాత్ర వహించాడన్న నిర్ధారణకు పోలీసులు వచ్చినట్లు తెలుస్తోంది. వివేకానందరెడ్డి హత్యకు 15 రోజుల ముందునుంచే కొంతమంది కిరాయి హంతకులు రిక్కీ నిర్వహించారని పోలీసుల విచారణలో వెల్లడైంది.
మరో వైపు
వివేకానందరెడ్డి హత్యకేసులో సిట్ దర్యాప్తు జరుగుతున్న విధానం సరిగా లేదని ఆయన కుమార్తె సునీత కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌గౌటాను కలిసి ఈ మేరకు ఫిర్యాదు పత్రం అందజేసింది. తన తండ్రి హత్యకు కారకులెవరో నిగ్గుతేల్చాలని కోరింది. తన తండ్రి వివేకా హత్య కేసును సిబిఐతో దర్యాప్తు చేయించాలని ఫిర్యాదులో పేర్కొంది.

Y S Vivekanand reddy was murdered

Wanna Share it with loved ones?