భూ సమగ్ర సర్వేపై కేసీఆర్ సమీక్ష

తెలంగాణలోని ప్రతీ భూమికి యజమాని ఎవరనేదానిపై స్పష్టత రానుంది. భూ వివాదాలకు తెరపడే విధంగా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణనను రూపొందించింది. తెలంగాణాలో సమగ్ర భూ సర్వే కోసం తెలంగాణ ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఈ బృహత్ ప్రణాళికను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఈ సర్వే వల్ల ప్రభుత్వ భూమి ఎంత ఉంది. ఎంత ప్రభుత్వ ఆధినంలో ఉంది అనే విషయం తేలిపోనుండడంతో పాటుగా ఆక్రమణలు, అక్రమాలు పూర్తిగా వెలుగులోకి రానున్నాయి. భూ యాజమాన్యానికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వం వద్ద రికార్డులు ఉంటాయి. భూ వివాదాలు సమసిపోవడంతో పాటుగా అక్రమాలకు తెరపడే అవకాశం ఉంది. చట్టం లోని లొసుగులు, వివరాల లేమి కారణంగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడంతో పాటుగా డబుల్ రిజిస్టేషన్ వంటి అక్రమ కార్యకలాపాలకు తెరపడే అవకాశం.
తెలంగాణ సమగ్ర భూ సర్వే పై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులతో పాటుగా ప్రభుత్వ ఉన్నత అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో చేపట్టబోయే కార్యక్రమంతో పాటుగా ప్రస్తుతం అమలవుతున్న రిజిస్టేషన్ విధానంలో రావాల్సిన మార్పులపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ప్రగతి భవన్ లో జరిగిన సమావేశంలో భూ రికార్డుల నిర్వహణపై విస్త్రృతంగా చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *