పొగాకు జోలికి పోవద్దంటూ కేవీ-1 విద్యార్థుల ప్రదర్శన

0
83
kv uppal 1
పొగాలు వాడకానికి వ్యతిరేకంగా కేవీ-1 ఉప్పల్ విద్యార్థుల ప్రదర్శన

kv-1 uppal పొగాలు ఉత్పత్తుల వాడకం వల్ల కలిగే దుస్పరిణామాలను వివరిస్తూ ఉప్పల్ కేంద్రీయ విద్యాలయం-1 విద్యార్థులు అవగాహానా కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ పొగాగు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కేంద్రీయ విద్యాలయానికి చెందిన స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పొగాకు వాడకం ప్రాణాంతకం అంటూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. పొగాకు వాడకం వల్ల పలిగే అనర్థాలను గురించి విద్యార్థులు ప్లదర్శించిన ప్లకార్డులు ఆలోచింపచేసేవిధంగా ఉన్నాయి. ఎండను సైతం లెక్కచేయకుండా విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.
అంతకు ముందు పాఠశాలలో విద్యార్థులు పొగాకు వాడకం వల్ల కలిగే అనర్థాలను గురించి నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో విద్యార్థులు పాల్గొంటూ పొగాకును ఏ రకంగా అయినా వాడకం ప్రాణాంతకమని దాని వల్ల వారితో పాటుగా వారి చుట్టుపక్కల ఉన్నవారు , కుటుంబానికి, సమాజానికి కలిగే హాని గురించి చక్కగా వివరించారు. ఇటు వకృత్వ పోటీల్లో కూడా విద్యార్థులు పొగాలు ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాలను గురించి చక్కగా వివరించారు. పొగ త్రాగడం, నమలడం వంటి చేష్టల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ చిన్నారులు మాట్లాడిన తీరు పలువురునికి ఆకట్టుకుంది. పొగాకు వల్ల కలిగే నష్టాలను గురించి విద్యార్థులు సృజనాత్మకంగా చిత్రాలు గీశారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ కేవీ-1 ప్రిన్సిపల్ పి.శ్రీనివాస రాజు, ఉపాధ్యాయులు రామలక్ష్మి, షర్మిలా, హమీదా, రామకోటి, యాదగిరి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.Minister’s portfolios ; name and responsibility

Wanna Share it with loved ones?