ప్రముఖ జర్నలిస్టు కుల్ దీప్ నయ్యర్ కన్నుమూత

0
63
Kuldip Nayar passes away

Kuldip Nayar passes away. ప్రముఖ జర్నలిస్ట్, రాజ్యసభ మాజీ సభ్యుడు, బ్రిటన్ మాజీ హైకమిషనర్ కులదీస్ నయ్యర్ (95) మృతిచెందారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నఆయన ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాలమిస్టుగా ప్రఖ్యాతి గాంచిన ఆయన బుధవారం రాత్రి కన్నుమూసినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వివిధ అంశాలపై 14 భాషలకు చెందిన 80కి పైగా వార్తాపత్రికలకు ఆయన వ్యాసాలు రాస్తున్నారు. భారత్ తో పాటుగా పలు అంతర్జాతీయ పత్రికల్లోనూ ఆయన వ్యాసాలు అచ్చయ్యాయి.
ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న సియాల్ కోట్ లో 1924లో జన్మించిన ఆయన తొలుత ఉర్థూ పత్రికలో పనిచేశారు. ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘స్టేట్స్ మన్’ చాలా కాలం పనిచేసిన ఆయన మానవహక్కుల కార్యకర్తగా కూడా వ్యవహరించారు. 1975-77 ఎమర్జెన్సీ సమయంలో కుల్ దీప్ నయ్యర్ అరెస్టయి జైలు జీవితం గడపాల్సి వచ్చింది. 1990లో గ్రేట్ బ్రిటన్ లో భారత రాయబార కార్యాలయం హై కమిషనర్ గా విధులు నిర్వహించారు. 1996లో భారతదేశం తరపున ఐక్యరాజ్యసమితికి వెళ్లిన ప్రతినిధి బృందలో సభ్యుడు. 1997లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ‘బియాండ్ ‌ద లైన్స్’, ‘ఇండియా ఆఫ్టర్‌ నెహ్రూ’ లాంటి రచనలు ఆయనకు గొప్ప పేరును సంపాదించిపెట్టాయి. వివిధ పత్రికల్లో ఆయన కొన్ని వేల వ్యాసాలు రాశారు.
కులదీస్ నయ్యర్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. నిజాయితీగా, నిర్భయంగా వ్యాసాలు రాసిన వక్తి, మా తరం మోధో దిగ్గజం, ఎమర్జెన్సీనీ బలంగా వ్యక్తిరేకించిన వ్యక్తి మృతి తీరని లోటని ప్రధాని తన సంతాప సందేశంలో పేర్గొన్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా తమ ట్విటర్ ద్వారా సంతాపాన్ని వ్యక్తం చేశార. కూల్ దీప్ నయ్యర్ మృతి పట్ల పలువురు జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నేతలు విచారం వ్యక్తం చేశారు.
Eminent Indian writer,journalist Kuldip Nayar, India and Pakistan, Beyond The Lines, human rights violations, High Commissioner of India to the U.K.

Wanna Share it with loved ones?