రాత్రికి రాత్రి విశ్వనగరంగా మారదు:కేటీఆర్

రాత్రికిరాత్రి హైదరాబాద్ విశ్వనగరంగా మారిపోతుందనే భ్రమలు సరికావని  మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో సోమవారం హైదరాబాద్ పై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. హైదారాబాద్ ను ప్రపంచంలోనే మేటి నగరంగా మార్చడానికి తమ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోందని త్వరలోనే హైదరాబాద్ ప్రపంచంలోని అత్యున్నత నగరాల సరసన చేరుతుందన్నారు. జీహెచ్ఎంసీకి నిధుల కొరత లేదని కేటీఅర్ చెప్పారు. గత రెండు సంవత్సరాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ కు 910 కోట్ల రూపాయలను కేటాయించినట్టు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి తాము ప్రణాళికా బద్దంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 463 బీటీ రోడ్డు పనులు పూర్తి కాగా 25 పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. 317 పూడికతీతలు పూర్తయ్యాయని మంత్రి చెప్పారు. 100 ప్రజా మరగుదొడ్ల నిర్మాణం జరిగిందని 21 శ్మానాన పనులు పూర్తి చేశమని మంత్రి వివరించారు. 370 పెట్రోల్ పంపుల్లో ప్రజా మరగుదొడ్ల ను ఏర్పాటు చేస్తున్నట్టు కేటీఆర్ చెప్పారు.
అంతకుముందు సభలో మాట్లాడిన బీజేసీ సభ్యులు హైదరాబాద్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి ప్రభుత్వాన్ని నిలదీశారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం చెప్పడం తప్పించి ఆచరణలో ఎక్కడా పనులు జరగడం లేదని శాసన సభ్యులు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు విమర్శించారు. వంద రోజుల ప్రణాళిక అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్పించి కార్యాచరణ కనిపించడం లేదన్నారు. హైదరాబాద్ లో రోడ్లు చాలా అధ్వాన్నంగా తయారయ్యాని వారు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *