ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన

0
108

ఉత్తర కోస్తాలోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల కోస్తా ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం విశాఖకు తూర్పు ఆగ్నేయ దిశగా 80 కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతం అయి ఉంది. ఇది ఉత్తర ఊశాన్య దిశగా కదులుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా, ఒడిశా కేంద్రాల వద్ద ఇది తీరాన్ని దాటే అవకాశం ఉందని అదే సమయంలో ఇది పూర్తి బలహీనపడే సుచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here