కొండగట్టు వద్ద ఘోర ప్రమాదం-50 మంది మృతి

kondagattu bus accident జగిత్యాల జిల్లాలోని ప్రముఖ ఆంజనేయ స్వామి దేవాలయం కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 50 మంది మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘాట్ రోడ్ లోని చివరి మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 70 మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డవారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్ శరత్, ఎస్పీ సుంధూ శర్మ లు ఘటనా స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
నిమిషాల్లోనే…
ఘాట్ రోడ్డు నుండి ప్రధాన రహదారికి చేరుకుంటున్న సమయంలోనే ఈ దారుణం జరిగింది. మరో ఒకటి రెండు నిమిషాల్లో ప్రధాన రహదారికి బస్సు వస్తుందనగా ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. జగిత్యాల డిపోటు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం పేట నుండి కొండగట్టు మీదుగు జగిత్యాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు బ్రేకులు ఫేలయినందు వల్లే ఈ దారుణం చోటుచేసుందని తెలుస్తోంది. మరో వైపు ప్రయాణికులు అంతా డ్రైవర్ ఉన్న వైపు ఒరగడం వల్ల బస్సు అదుపుతప్పిందని చెప్తున్నారు. ఈ విషాధ ఘటనలో ఎడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
ఘాట్ రోడ్ లోని ఆఖరి మలుపు వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ప్రయాణికులు ఒక్కసారిగా డ్రైవర్ వైపు ఒరగడం లేదా బస్సు బ్రేకులు ఫెయిల్ కావడం లేదా మరేదైైనా సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగిఉండవచ్చని వారు పేర్కొంటున్నారు. కొద్ది సేపట్లో బస్సు ప్రధాన రహదారకి చేరుకునేదని ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని వారంటున్నారు. బస్సు లోయలో పడిపోవడంతో ఊపిరి ఆడగ ప్రయాణికులు మృతి చెందారని వారు తెలిపారు.
కొండగట్టు మార్గం బస్సుల ప్రయాణానికి అనువుగా లేకపోవడంతో ఈ మార్గంలో బస్సుల రాకపోకలను గతంలోనే నిలిపివేశారు. అసలు బస్సు ఈ రూట్ లో ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని స్థానికులు చెప్తున్నారు. బస్సు దారి తప్పి ఈ రూట్ లో వచ్చిందనే అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాద ఘటనపై అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. సాహాయక కార్యక్రమాను ముమ్మరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ఈ దారుణం చోటుచేసుకుందని ఆపద్ధర్మ మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు.
kondagattu bus accident

జంట పేలుళ్ల కేసులో ఇద్దరికి మరణశిక్ష


Troubling worms in little tummy