కాంగ్రెస్ లోకి కొండా దంపతులు?

0
52

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేష, ఆమె భర్తా ఎమ్మెల్సీ కొండా మురళిలు కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పటికే వారితో మంతనాలు పూర్తయ్యాయని వారు జిల్లాలో రెండు సీట్లు అడుగుతున్నారంటూ ఉత్తమ్ మీడియా ఇష్టాగోష్టిలో చెప్పారు. తొలుత కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న కొండా దంపతులు ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్ వెంట నడిచారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనతో విభేదించిన సురేఖ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కి మద్దతుగా మంత్రి పదవిని సైతం వదులుకున్నారు. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సురేఖ పరకాల నుండి పోటీ చేసి వై.ఎస్. జగన్ పార్టీ తరపున విజయం సాధించారు. అయితే జగన్మోహన్ రెడ్డితో వచ్చిన విభేదాలతో జగన్ కు దూరం అయిన ఆమె అటు తర్వాత కొద్ది రోజులకు టీఆర్ఎస్ లో చేరారు.
కొండా దంపతులు టీఆర్ఎస్ లో చేరినప్పటికీ వారికి పార్టీలో సరైన ప్రధాన్యం దక్కలేదని, దీనితో వారు పార్టీలో పూర్తిగా ఇమడలేకపోతున్నారనే ప్రచారం ఉంది. సురేఖను పార్టీలో చేర్చుకునే విషయంలోనూ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. జగన్ రైలు యాత్రను తెలంగాణ వాదులు అడ్డుకున్న సందర్భంలో సురేఖ వ్యవహార శైలి, తెలంగాణ వాదులపై సురేఖ అనుచరులు దాడిచేసిన సంగతి మర్చిపోయి వారిని పార్టీలోకి చేర్చుకోవడం సరికాదనే విషయాన్ని కొంత మంది పార్టీ పెద్దలవద్ద ప్రస్తావించినా కేసీఆర్ ఆభ్యంతరాలను పక్కనపెట్టి మరీ టీఆర్ఎస్ లోకి కొండా దంపతులను ఆహ్వానించాడు. ప్రస్తుతం కొండా సురేష్ టీఆర్ఎస్ పార్టీ తరపున వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా కొండా మురళి ఎమ్మెల్సీగా ఉన్నారు.
అంగ బలం, అర్థ బలం ఉన్న కొండా సురేఖను తమ వైపు తిప్పుకుంటే పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావించిన కొంత మంది నేతలు సురేఖ దంపతులను సంప్రదించినట్టు సమాచారం. ఒక వైపు కొండా దంపతులు పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఉత్తమ్ కుమార్ ఏకంగా వారు పార్టీలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ ప్రకటించడం సంచలనంగా మారింది. కొండా మురళి దంపతులకు మొదటి నుండి రాజకీయ, వర్గ శత్రువుగా ఉన్న ఎర్రబల్లి దయాకర్ కూడా ప్రస్తుతం టీఆర్ఎస్ లోనే ఉండడంతో పార్టీలో తమకు తగినంత ప్రధాన్యం లభించడం లేదని ఈ దంపతులు వాపోతున్నట్టు వార్తలు వసతున్నాయి. మొత్తానికి ఉత్తమ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here