పార్టీ మారే ఆలోచనే లేదంటున్న కొండా దంపతులు

0
48

కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గాను ఆ పార్టీ నేతలతో తాము బేరసారాలకు దిగినట్టుగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోండా మురళి, కొండా సురేఖ దంపతులు తీవ్రంగా మండిపడతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తాము ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని వారు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో తాము ఆనందంగా ఉన్నామని ఈ పరిస్థితులలో పార్టీ మారాల్సిన అవసరం తమకు లేదని వారు చెప్పారు. అబద్దపు ప్రచారాలు చేయడం ద్వారా తమను రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కొండా దంపతులు అంటున్నారు. తాము పార్టీ మారుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారం పై ముఖ్యమంత్రి కి వివరణ ఇవ్వనున్నట్టు వారు పేర్కొన్నారు.టీఆర్ఎస్ పార్టీలో తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ తమను బాగా చూసుకుంటున్నారని పార్టీలో ఎటువంటి సమస్యలు లేనప్పుడు తాము పార్టీ మారాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు. తాము ఎవరితో బేరాలకు దిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.
తాము ఎటువంటి సంప్రదింపులు జరపకున్నా తమ పేరు చెప్పడం సరైంది కాదని దీనికి తెలంగాణ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని కొండా దంపతులు డిమాండ్ చేశారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here