కొత్త పార్టీపై నోరు మెదపని కోమటిరెడ్డి

సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం పై ఆయన నేరు మెదపడం లేదు. మీడియాతో అనేక విషయాలను మాట్లాడిన కోమటిరెడ్డి రాజకీయ పార్టీ విషయంలో మాత్రం మాటను దాటవేశారు. చాలాకాలం నుండి పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న కోమటిరెడ్డి ఆశలు నెరవేరే సూచనలు కనిపించకపోవడంతో బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. ఒక దశలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కోమటిరెడ్డి సోదరులు కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్నరనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే కొత్త రాజకీయ పార్టీకి సబంధించిన వార్తల విషయంలో మీడియా అడిగిన ప్రశ్నను దాటవేసిన ఆయన రానున్న రోజుల్లో టీఆర్ఎస్ దెబ్బతినడం ఖాయం అంటూ చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాల నుండి ఉన్నాను కాబట్టే పార్టీ అధ్యక్షపదవిని కోరుకుంటున్నట్టు కోమటిరెడ్డి చెప్పారు. సీనియర్ నేతగా పార్టీలో పదవులు అశించడం తప్పుకాదని అన్న ఆయన పదవి వచ్చినా రాకున్నా ఒకటేనన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థులకు సీట్లిస్తే తమ గెలుపు మరింత సులభం అవుతుందని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. పొల్టికల్ జేఏసీ రాజకీయ పార్టీ మారినా ఎవరు పనిచేస్తారని ప్రజలు భావిస్తారో వారికే ఓట్లు వేస్తారని అన్నారు.