యూఎన్ఓ మాజీ సెక్రటరీ జనర్ కోఫీ అన్నన్ కన్నుమూత

0
82
కోఫీ అన్నాన్

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ మృతిచెందారు. స్విట్జర్లాండ్ లోని ఓ ఆస్పత్రిలో అన్న్ తుది శ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. అనారోగ్యం వల్ల ఆయన చనిపోయారని కోఫి అన్నన్ ఫౌడేషన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయనకు భార్య నానే, పిల్లలు అమా,కోజో,నినా ఉన్నారు. ఆఖరి సమయంలో వీరంతా ఆయన దగ్గరే ఉన్నారు.
ఆఫ్రికా ఖండం నుండి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గా ఎంపికైనా తొలి వ్యక్తిగా కోఫీ అన్నన్ పేరు సంపాదించుకున్నారు.గొప్ప వ్యక్తిని, నాయకుడిని, ముందుచూపు గల వ్యక్తిని కోల్పోయామని ఐరాస వలసల విభాగం ట్విటర్‌ ద్వారా సంతాపం వ్యక్తం చేసింది.జనవరి 1, 1997 నుంచి డిసెంబరు 31, 2006 వరకూ పదేళ్ళపాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. 2001లో ఆయన నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ఆఫ్రికాలోని ఘనా దేశంలో జన్మించిన అన్నన్ అంచెలంచలుగా ఎదిగారు. చదువులో మంచి ప్రతిభను చూపిన ఆయన అమెరికాలో చదువుకున్నారు. 1961లో డిగ్రీ, 1972లో మేనేజ్‌మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. 1962లో బడ్జెట్ అధికారిగా అన్నన్ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించారు. 1987-92 కాలంలో సహాయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1997లో తొలిసారి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ నుంచి బాధ్యతలు స్వీకరించారు.
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గా కోఫీ అన్నన్ వెనుబడిన దేశాల, ప్రజల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారు. ఆఫ్రికా దేశాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిది. ప్రపంచ శాంతి కోసం పాటాపట్టారు. ఐక్యరాజ్య సమితిలో కొన్ని దేశాల ఆధిపత్యాన్ని ఆయన ప్రశ్నించారు. వెనకబడిన దేశాలను ముందుకు తీసుకుని వచ్చినపుడే ఐక్యరాజ్య సమితి అసలైన లక్ష్యాలు నెరవేరుతాయన్నారు.మానవ హక్కుల కోసం ఆయన పాటుపడ్డారు. అన్ని దేశాలు సమగ్రంగా అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యారాజ్య సమితి నుండి బయటికి వచ్చిన తరువాత కోఫి అన్నన్ ఫౌండేషన్ ను స్థాపించిన ఆయన నెల్సన్ మండేలా స్థాపించిన సంస్థ ది ఎల్డర్స్ గ్రూప్ లో సభ్యుడిగా చేరారు.
Kofi Atta Annan,Kofi Annan,Secretary-General of the United Nations,The Elders,Nelson Mandela,Kumasi,Ghana, World Health Organization.

అపార నష్టం కలిగిస్తున్న కేరళా వరదలు


మహా నేత ఆఖరి ఫొటో| Atal Bihari Vajpayee last photograph
Kofi_Annan

Wanna Share it with loved ones?