వాళ్లిద్దరీకీ ఎందుకు చెడింది…! | kodandaram vs kcr

kcr-kodandaram kodandaram vs kcr
తెలంగాణ ఉధ్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి… పొల్టికల్ జేఏసీ ఛైర్మన్ గా ఉన్న కోదండరాంపై అప్పటి సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు…. కోదండరాంపై విమర్శలు చేసిన వారిపై కేసీఆర్ నిప్పులు చెరిగారు… తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపం కోదండరాం అని ఆయన్ను విమర్శిస్తే నాలుకలు కోస్తాం అంటూ మండిపడ్డాడు. కోదండరాం చిన్న మాట అన్నా ఊరుకునేది లేదంటూ విరచుకుని పడ్డారు…కాలం మారింది పరిస్థితులూ మారాయి ఇప్పుడు కోదండరాం పై టీఅర్ఎస్ నాయకులే విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కోదండరాం ను తెలంగాణ ద్రోహిగా అభివర్ణిస్తున్నారు. నాటు సఖ్యతకు మారుపేరుగా నిల్చిన కేసీఆర్…కోదండరాంలు ఇప్పుడు బద్ద శత్రువులుగా ఎందుకు మారారు.. అసలు ఏం జరింది.
తెలంగాణ ఉధ్యమంలో పొల్టికల్ జేఏసీది కీలక పాత్ర… టీఆర్ఎస్ రాజకీయ పోరాటం చేస్తే అన్ని వర్గాలను ఒక్కటాకిపై తీసుకుని వచ్చి వివిధ ప్రజాసంఘాలను ఒకే వేదికపైకి తీసుకుని వచ్చింది తెలంగాణ జేఏసీనే… తెలంగాణకు సంబంధించిన ప్రతీ ఉధ్యమ వేదికపై కేసీఆర్ తో పాటుగా కోదండరాం కూడా ప్రముఖంగా కనిపించే వారు. తెలంగాణ ఉధ్యమం సఫలం అయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిపోయింది. అయితే అప్పటి దాకా కలిసి పనిచేసిన జేఏసీ చైర్మన్ కోదండరాం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ఎన్నికలకు ముందు ఎన్నికల్లో జేఏసీ టీఆర్ఎస్ కు మద్దతు పలకాల్సిందిగా కేసీఆర్ కోరినా కోదండరాం పెడచెవిన పెట్టారని అక్కడి నుండి ఇద్దరి మధ్య దూరం పెరిగిందని రాజకీయ వర్గాల కథనం. తెలంగాణ ఏర్పడిన తరువాత ఇక జేఏసీ అవసరం లేదని అంటూ కోదండరాంను టీఆర్ఎస్ తరపున ఎన్నికల్లో పోటీచేయాలని కేసీఆర్ అహ్వానించినా కోదండరాం దాన్ని తిరస్కరించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. కనీసం టీఆర్ఎస్ తరపున రాజ్యసభ సీటును ఆఫర్ చేసినా కోదండరాం పట్టించుకోలేదని సమాచారం. దీనికి తోడు కోదండరాం కాంగ్రెస్ కు దగ్గర అయ్యాడనే వార్తలు కూడా వచ్చాయి. కాంగ్రెస్ అధిష్టానం కోదండరాంతో మంతనాలు జరిపిందని దీనికి కోదండరాం ఆశక్తి చూపాడని వచ్చిన వార్తలు కేసీఆర్ ను కోదండరాంకు మరింత దూరం చేశాయి. కోదండరాం కాంగ్రెస్ కు మద్దతుగా ప్రచారం చేయనప్పటికీ టీఆర్ఎస్  కు అనుకూలంగా కూడా ప్రచారం చేయలేదు. అక్కడ మొదలైన దూరం ఇద్దరి మధ్యా పెరుగుతూ వచ్చింది. ఎన్నికల తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కోదండరాం పలు సార్లు కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరినా ఫలితం లేకుండా పోయిందనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య దూరం మరింతగా పెరిగింది.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత కోదండరాం ప్రభుత్వ విధానాలపై ఆచీతూచీ స్పందించారు. చాలా రోజులు ఇరువర్గాలు సంయవనం పాటించినా ప్రభుత్వంపై జేఏసీ విమర్శలు పెరగడంతో టీఆర్ఎస్ కూడా జోరు మరింత పెంచింది. కేసీఆర్ లేకుంటే కోదండరాం ఎక్కడున్నాడంటూ టీఆర్ఎస్  నేతలు విమర్శలు గుప్పించారు. కోదండరాం ప్రభుత్వం పై విమర్శలు చేసినా కేసీఆర్ పై విమర్శలు చేయకున్నా పరిస్థితిలో మార్పుతో నేరుగా కేసీఆర్ పైనే కోదండరాం విమర్శలు చేస్తుండడంతో వివాదం తీవ్రం అయింది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకునే వరకు వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టుల నిర్వాసితుల వ్యవహారంతో పాటుగా ఉద్యోగాల వ్యవహారంలో కేసీఆర్-కోదండరాంల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. నిరుద్యోగ ర్యాలీ సందర్భంగా కోదండరాంను అరెస్టు చేసిన తీరుతో ఇవి మరింత ముదురినట్టే కనిపిస్తోంది.
కేసీఆర్,కోదండరాంల వ్యవహారంలో సామాజిక వర్గం అంశాన్ని కూడా కొందరు లెవనెత్తుతున్నారు. సంవత్సరాలుగా తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పిన వర్గానికి చెందిన కోదండరాంను కేసీఆర్ కావాలనే పక్కన పెట్టాడని కోదండరాం తన సామాజిక వర్గానికి చేరువ కావడం ఆ దిశగా మంతనాలు సాగడం వల్ల కూడా వీరి మధ్య విభేదాలు  తీవ్రం అయ్యాయనే వాదన కూడా ఉంది.  వీరిద్దరి మధ్య సహోధ్య కుదర్చడానికి కొందరు చేసిన ప్రయత్నాలు ముందుక సాగలేదు. కేసీఆర్ వల్లే వీరి మధ్య స్నేహం చెడిందని  కేసీఆర్ కు వాడుకుని విదిలేసే అలవాటు ఉందని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. అయితే కేసీఆర్ కు కోదండరాం వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేశాడనేది కొందరి వాదన…
kodandaram vs kcr, kondaram, prof kondandaram, telangana,telangana state, telangana cm.
కోదండరాం
కోదండరాం
ఉస్మానియా విశ్వవిద్యాలయం
జార్జి రెడ్డి
నిజాం కాలేజీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *