కొలువులకై కొట్లాట సభ జరిపితీరతాం:కోదండరామ్

0
58

ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా నవంబర్ 30 న కొలువులకై కోట్లాట సభ నిర్వహించి తీరతామని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ తెలిపారు. సభ జరుపుకునేందుకు కోర్టు అనుమతి ఇవ్వడం ప్రజాస్వామ్యవాదుల విజయంగా ఆయన అభివర్ణించారు. శాంతిభద్రతల పేరుతో సభలను నిర్వహించనీయకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం నిరంకుశ రాజ్యం నడుస్తోందన్నారు. ప్రజాస్వామ్యయుతంగా సభలు, సమావేశాలు జరగీయకుండా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని కోదండరామ్ పేర్కొన్నారు. సరూర్ నగర్ మైదానంలో సభను నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారని ఆయన అన్నారు. కోర్టు తీర్పు వల్లే సభ జరపగలుతున్నామని అన్నారు.
తెలంగాణ జేఏసీ తరపున రాజకీయ పార్టీ ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయని దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కోదండరామ్ వెల్లడించారు. రాజకీయంగా జేఏసీని పటిష్టపర్చాలని దీని కోసం రాజకీయ వేదిక కావాలని భావిస్తున్నట్టు చెప్పారు. అయితే పార్టీ ఏర్పాటు పై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కోదండరామ్ తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికోసం గాను షెడ్యూల్ ప్రకటించాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెంచాలని సమాన పనికి సమాన వేతన విధానాన్ని అమలు చేయాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. డిసెంబర్ 9,10వ తేదీల్లో నల్గొండలో తెలంగాణ అమరవీరు స్పూర్తి యాత్ర నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here