ఉత్తర కొరియా వైఖరిలో ఎందుకీ మార్పు…?

చాలా కాలంగా తన దుండుగు చర్యలతో ప్రపంచ శాంతికి విఘాతం కలింగించేలా ప్రవర్తిస్తూ వచ్చిన ఉత్తర కొరియా కొన్నాళ్లుగా శాంతి వచనలు పలుకుతున్న సంగతి తెలిసిందే. ఇదే ప్రమంలో ఆదేశం మరో భారీ ముందడుగు వేసింది. అణు పరిక్షలను ప్రధాన కేంద్రంగా ఉన్న కేంద్రాన్ని ధ్వంసం చేయాలని నిర్ణయించింది. దీనికి గాను అంతర్జాతీయ మీడియాను ఆహ్వనించి మరీ ఉత్తర కొరియా ప్యూంగేరి అణు కేంద్రాన్ని ధ్వంసం చేస్తోంది. నిర్మానుష్యప్రాంతంలో ఉన్న ఈ కేంద్రాన్ని ధ్వంసం చేసే సమయంలో ఎంపికచేసిన కొద్ది మంది అంతర్జాతీయ మీడియా ప్రతినిధులనుకుడా ఆహ్వానిస్తోంది.
అమెరికా, దక్షిణ కొరియాలతో యుద్ధానికి సిద్ధమంటూ పదేపదే హెచ్చరికలు చేస్తూ యుద్దోన్మాదంతో రగిలిపోయిన ఉత్తర కొరియా వైఖరిలో హఠాత్తుగా వచ్చిన మార్పుకు పలు కారణాలు కన్పిస్తున్నాయి.
1. ఉత్తర కొరియా పై చైనా ఒత్తిడి పనిచేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా తరహా పాత్రను పోషించాలని తహతహ లాడుతున్న చైనా దానికి తొలిమెట్టుగా ఉత్తర కొరియాను ఉపయోగించుకుంది. ఆ దేశానికి అన్నిరకాలుగా సహాయం చేస్తున్న చైనా పై ఉన్న ప్రపంచవ్యతిరేక ముద్రను తొలగించుకునేందుకు చైనా ప్రభుత్వం సామ,ధాన, బేధోపాయాలను ఉపయోగించి ఉత్తర కొరియా చేత శాంతి జపాలు చేయిస్తోంది.
2. ప్రపంచ దేశాల ఆర్థిక ఆంక్షల కారణంగా దేశంలో పరిస్థితిలు దారుణంగా తయారయ్యాయి. దేశంలో లక్షలాది మంది ప్రజలు కనీసం తినడానికి తిండి కూడా తినలోని పరిస్థితులు తలెత్తాయి. ఎక్కువ రోజులు ప్రజలను ఈ పరిస్థితుల్లో ఉంచడం సరైంది కాదని ఇటువంటి పరిస్థితులే వస్తే ప్రజల నుండి తిరుగుబాటు రావడం ఖాయమని భావించిన నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు.
3. ఇప్పటికే ఆదేశం పలు దఫాలుగా అణు పరీక్షలు నిర్వహించింది. ప్రస్తుతం పరీక్షలు, క్షిపణి ప్రయోగాలు జపాల్సిన అవసరం లేకుండా పోయింది. తమ అణ్వాయుధ సామార్థ్యం పై ప్రపంచం ఒక అంచనాకు వచ్చేసిన నేపధ్యంలో అణు ప్రయోగాలు జరపాల్సిన అవసరం లేదని తేలిపోయిన నేపధ్యంలోనే ఉత్తర కొరియా శాంతి వచనాలు వల్లిస్తోంది.
4. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్- ఉత్తర కొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ల మధ్య రహస్య ఒప్పందం జరిగిందనే ప్రచారం కూడా జరుగుతోంది. సింగపూర్ లో త్వరలో భేటీ కానున్న ఈ ఇరువురు నేతలు తమ భేటీకి ముందే కొన్ని రంగాల్లో కీలక పురోగతిని సాధించాలనే ప్రయత్నాలో ఉన్నారు. ఇదే తరుణంలో ఉత్తర కొరియా అణ్వయుధ ప్రయోగశాలను ధ్వసం చేయాలని నిర్ణయించింది. దీని వెనుక భారీ కసరత్తు జరిగిందని ఉత్తర కొరియాకు తెరచాటుగా భారీగా ఆర్థిక సహాయం అందుతోందని మరో ప్రచారం ఉంది.
5. ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు విలన్ గా మారిగా ఉత్తర కొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తన వైఖరిని మార్చుకుని ప్రపంచదేశాల ముందు కొత్త ఇమేజ్ ను సొంతం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఆయన కొత్తగా శాంతి పల్లవిని అందుకున్నాడని భావిస్తున్నారు.
అణ్వాయుధ ప్రయోగాలను చేయమని చెప్పిన ఉత్తర కొరియా తమవద్ద భారిగా పోగుపడి ఉన్న అణు క్షిపణులను గురించి మాత్రం ఎటువంటి ప్రకటనా చేయడం లేదు.
North Korea, Democratic People’s Republic of Korea,East Asia, Korean Peninsula. Pyongyang is, China, Russia, South Korea, Japan,Kim Jong-un, north korea president.

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఎంపికకు కారణం అదేనా…!


ప్రగతీ రీసార్ట్స్ హత్య కేసులో స్నేహితుడే నిందితుడు
Kim_Jong-un