కిడారి కుటుంబానికి కోటిరూపాయల ఎక్స్ గ్రేషియా

0
121
కిడారి సర్వేశ్వరరావు

మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుటుంబాన్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. పాడేరులోని కిడారి నివాసానికి వచ్చిన ముఖ్యమంత్రి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును నక్సలైట్లు అరకు సమీపంలో కాల్చిచంపిన సంగతి తెలిసిందే. అమరావతి నుండి విశాఖపట్నానికి విమానంలో వచ్చిన చంద్రబాబు అక్కడి నుండి పాడేరుకు హెలిక్యాఫ్టర్ లో చేరుకున్నారు. కిడారి నివాసానికి వెళ్లిన ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. వారికి అన్ని విధాలుగా ఉండగా ఉంటానని హామీ ఇచ్చారు. కిడారి కుటుంబానికి ప్రభుత్వం తరపున కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామన్నారు. కుటుంబ సభ్యుల్లో నలుగురికి 5 లక్షల రూపాయలు పార్టీ తరపున ఇస్తామని సీఎం ప్రకటించారు. చిన్న కుమారుడికి గ్రూప్-1 ఉద్యోగాన్ని కల్పించనున్నట్టు చంద్రబాబు చెప్పారు.
పెద్ద కుమారుడి భవిష్యత్తును గురించి పార్టీ నిర్ణయిస్తుందన్నారు. ఆయనకు పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్టు ఇవ్వాలా వద్దా అనే విషయం పై కూడా పార్టీనే నిర్ణయం తీసుకుంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. గిరిజనుల అభివృద్ధికోసం పాటుపడుతున్న కిడారి సర్వేశ్వరరావును మావోలు హతమార్చడం బాధాకరమన్నారు. బలమైన గిరిజన నేతను మావోలు దారుణంగా హత్యచేయడం పై ఆయన ఆందోళన వెలుబుచ్చారు. బాక్సైట్ గనులను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన సంగతిని ఆయన గుర్తుచేశారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాక్సైట్ గనుల తవ్వకానికి అనుమతులు ఇచ్చారని వాటిని తమ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు.
భర్తనే కోల్పోయాను… ధైర్యాన్ని కాదు… : వీరజవాను భార్య

Wanna Share it with loved ones?