కేరళలో ఏబీవీపీ భారీ ర్యాలీ

అఖిలభారత విద్యార్థి పరిషత్ (abvp) నిర్వహించిన ఛలో కేరళ ర్యాలీలో దేశం నలుమూల నుండి విద్యార్థులు హాజరయ్యారు. కేరళలో హింధు సంస్థలకు చెందిన వారిపై జరుగుతున్న దాడులకు నిరసగా ఏబీవీపీ తలపెట్టిన ఈ భారీ ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. కేరళ రాష్ట్రం రాజకీయ హత్యలకు నిలయంగా మారిందని ఈ సందర్భంగా ప్రసంగించిన వక్తలు ఆరోపించారు. కేరళలో ఏబీవీపీ, బీజేపీ, వీహెచ్ పీ లాంటి హింధు సంస్థలకు చెందిన వారిని సీపీఎం కార్యకర్తలు హత్యలు చేస్తున్నా కేరళా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని వారు మండిపడ్డారు. కేరళ రాష్ట్రంలో తమ ఉనికిని కాపాడు కోవడం కోసం వామపక్షాలు దారుణాలకు తెగబడుతున్నాయని వారు ఆరోపించారు. పెద్ద సంఖ్యలో దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురిచేసేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని తాము అడ్డుకుంటామని అన్నారు. వామపక్ష రౌడీల దాడులకు తగిన రీతిని జవాబు చెప్తామన్నారు.