అపార నష్టం కలిగిస్తున్న కేరళా వరదలు

కేరళా వరదలు అపార నష్టాన్ని కలిగిస్తున్నాయి. ప్రకృతి ప్రకోపాలని కేరళ తల్లడిల్లుతోంది. భారీ వదలు కేరళను ముంచెత్తాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుని పోయాయి. కొన్ని ఇళ్లు కళ్ల ముందే పేకమేడల్లా కూలిపోయాయి. గ్రామాలు, పట్టణాళను వరదనీరు ముంచెత్తింది. దాదాపు 10 నుండి 15 అడుగల మేర నీళ్లు ప్రవహిస్తున్నాయి. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 350 మంది ప్రాణాలు కోల్పోగా వందల మంది గాయపడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 3.5 లక్షల మంది ఇళ్లు వాకిలి వదిలిపెట్టి పభుత్వం ఏర్పాటు చేసిన ఆశ్రయాల్లో తలదాచుకుంటున్నారు.

వృద్దులు చిన్నపిల్లల పరిస్థితి దారుణంగా ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం సహాయక బృందాలకు తలకు మించిన భారంగా తయారయింది. జాతీయ విపత్తు నివారణ సంస్థతో పాటుగా ఆర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్స్ దళాలు సహాయక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నప్పటికీ సరిపోవడం లేదు. సహాయకార్యక్రమాలకు ఇబ్బందిగా మారడానికి కేరళా భౌగోళిక స్వరూపంతో పాటుగా ఆరాష్ట్రంలోని పరిస్థితులు కూడా కారణంగా కనిపిస్తోంది. కేరళలో ఇళ్లు విసిరేసినట్టు అక్కడొకటి, ఇక్కడొకటి ఉంటాయి. కొన్ని పట్టణాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఇటువంటి పరిస్థితులే సహాయక కార్యక్రమాలకు ఇబ్బందిగా మారాయి. కేరళా వరదలు భారీగా ఆస్టి,ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి.
భారీ ఆస్తి నష్టం
భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళలో భారీ ఆస్తినష్టం జరిగింది, పంటలు నీట మునిగాయి, పెద్ద ఎత్తున రబ్బర్,కొబ్బరి, సుగంధ ద్రవ్యాల తోటలు నేలమట్టం అయ్యాయి. వంతెనలు కొట్టుకొని పోగా ఇళ్లు కూలిపోయాయి. కరెంటు స్థంబాలు నెలకొరగడంతో దాదాపు 80 శాతం కేరళ అంధకారంలోనే ఉంది. ఈ విపత్తు వల్ల కేరళకు దాదాపు 25వేల కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం 2000వేల కోట్ల రూపాయల సహాయం అందిచాలని ఆయన కోరారు.
వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళలో ప్రధాని నరేంద్ర మోడి ఏరియల్ సర్వేను నిర్వహించారు. బాధితులను ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. జరిగిన నష్టాన్ని గురించి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగితెలుసుకున్నారు. తక్షణ సహాయంగా రు.500 కోట్లను ప్రధాని ప్రకటించారు.
వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేరళను ఆదుకునేందుకు రంగంలోకి దిగాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 25 కోట్ల రూపాయల సహాయం ప్రకటించడంతో పాటుగా మెట్రిక్‌ టన్నుల పాలపొడి ప్యాకెట్లను పెద్ద సంఖ్యలో ఆ రాష్ట్రానికి పంపుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.10కోట్ల విరాళం ఇస్తోంది. బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కేరళకు రూ.10కోట్ల సహాయం ప్రకటించారు. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టార్‌ రూ.10కోట్ల సాయం ప్రకటించారు.దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ రూ.10కోట్ల సాయం ప్రకటించారు.గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ రూ.10కోట్లు ఆర్థికసాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ రూ.5కోట్ల సాయం ప్రకటించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఒక నెల జీతాన్ని కేరళ సహాయ నిధికి ఇవ్వనున్నారు. అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ కేరళ బాధితుల కోసం రూ.కోటి విరాళంగా ప్రకటించారు. స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా రూ.2కోట్ల సాయం ప్రకటించింది.
kerala floods
కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోరారు. కేంద్రం వెంటనే స్పందించిన దెబ్బతిన్న రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలన్నారు. కేరళ వరద బాధితుల కోసం ఆహారం, మంచి నీరు సరఫరా చేసేందుకు ప్రత్యేక రైలు ఈరోజు మహారాష్ట్రలోని పుణె నుంచి బయలుదేరుతోంది. కేరళలోని చిన్నారుల కోసం.. వంద టన్నుల ఆహార పొట్లాలను పంపిస్తున్నట్లు కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనక గాంధీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వంద బాలామృతాన్ని కేరళకు పంపిస్తోంది.
kerala,kerala floods, floods in kerala, floods, heavy floods in kerala.

కేరళలో వరద బీభత్సం