కేరళ వరదలు , సహాయం పై అనుచిత వ్యాఖ్యలు-ఊడిన ఉద్యోగం

0
65
కేరళ వరదలు

కేరళ వరదలు, సహాయం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ ప్రవాస భారతీయుడు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేరళలను వదరలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. వరదల కారణంగా లక్షలాది మంది సునరావాస కేంద్రాల్లో గడపుతున్నారు. వారిని ఆదుకునేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. కేరళకు వరద సహాయంపై సామాజిక మాధ్యమాల్లో అనుచిక వ్యాఖ్యలు చేసిన రాహుల్‌ చెరు పళయట్టు అనే కేరళకు చెందిన వ్యక్తిని వెంటనే ఉద్యోగం నుండి తొలగిస్తున్న అతను పనిచేస్తున్న కంపెనీ ప్రకటించింది.
కేరళకు చెందిన రాహుల్ ఓమన్ లోని లూలూ కంపెనీలో క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. కేరళ వరదలు, వాటికి సహాయానికి సంబంధించి అతను అసభ్యంగా కామెంట్లు చేశాడు. వరదల్లో బాధపడుతున్నవారికి శానిటరీ న్యాప్ కిన్ల అవసరం కూడా ఉందని వాటిని కూడా పంపాలని ఒకరు చేసిన పోస్టుకు స్పందిస్తూ “కండోలు కూడా అవసరమే” అంటూ వ్యాఖ్యానించాడు. ఈ పోస్టును చూసిన సదరు కంపెనీ వెంటనే స్పందించింది. రాహుల్ ను వెంటనే పదవి నుండి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను కూడా సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. వరదల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో అతను చేసిన వ్యాఖ్యలు ఎంత మాత్రం సమంజసం కాదని ఇబ్బందుల్లో ఉన్న వారిపట్ల అతను చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని పేర్కొంటూ తక్షణం అతన్ని పదవీలోనుండి తొలగిస్తున్నట్టు కంపేనీ హేచ్ ఆర్ పేర్కొంది.
ఉద్యోగం కోల్పోయిన తరువాత రాహుల్‌ చెరు పళయట్టు తాను తప్పు చేశానని మధ్యం మత్తులో తాను అటువంటి పోస్ట్ చేశానంటూ చెప్పాడు. తన తప్పును మన్నించాలంటూ అతని చేసిన విజ్ఞప్తిని కంపెనీ తోసిపుచ్చింది. అతను చేసిన తప్పును క్షమించే ప్రశక్తిలేదని లూలూ కంపెనీ అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గబోమని తమ కంపెనీ అత్యన్నన మానవతా విలువలను పాటిస్తుందని వారు చెప్పారు. ఓమన్ లోని ప్రముఖ కంపెన్నీలో ఒకటిగా పేరున్న లూలూ కంపెనీ కూడా కేరళకు చెందిన వారిదే. ఆ రాష్ట్రానికి చెందిన యూసఫ్ ఆలీ లూలూ కంపెంనీని ప్రారంభించారు. కేరళలోని వరద బాధితులను ఆదుకునేందు లూలూ ఇప్పటివరకు దాదాపు 90 లక్షల దినహరమ్ లను విరాళంగా ప్రకటించింది.
A Kerala man fired by his employer, Oman, insensitive comments, victims,
Rahul Cheru Palayattu, Lulu Group International, Lulu’s HR manager in Oman,V. Nandakumar, CCO of LuLu Group, 9.23 million dirhams.

అపార నష్టం కలిగిస్తున్న కేరళా వరదలు


కేరళలో వరద బీభత్సం

Wanna Share it with loved ones?