కేరళలో వరద బీభత్సం

0
111
కేరళలో వరద భీబత్సం

కేరళలో వరద భీబత్సం కొనసాగుతోంది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పరస్థితి దారుణంగా తయారయింది. వర్షాలకు రాష్టంరోలని నదులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా కేరళలో ఇప్పటివరకు 87 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులుగా మారారు. దాదాపు రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
రాష్ట్రంలోని 14 జిల్లాలో రెడ్ అలర్ట్ ను జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా రవాణాసేవలు పూర్తిగా స్తంభించాయి. రోడ్డు మార్గాలు దెబ్బతినడంతో బస్సులు నడవడం లేదు, మెట్రోతో పాటుగా రైలు సేవలు నిల్చిపోయాయి. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వరదనీరు వచ్చిచేరడంతో విమానాశ్రయాన్ని సైతం మూసివేయాల్సి వచ్చింది.
పెరియార్‌ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పంబానది పొంగిపొర్లుతోంది. అన్ని జలాశయాలు నిండు కుండల్లా తయారయ్యాయి. ముల్లపెరియార్‌, చెరుతోని, ఇడుక్కి, ఇదమలయార్‌తో సహా ఇతర ప్రధాన జలాశయాల గేట్లన్నింటినీ ఎత్తివేశారు. దీనితో దిగువ ప్రాంతాలను వరదనీరు ముంచెత్తుతోంది. దాదాపు రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు సైన్యం రంగంలోకి దిగింది. సైనిక పటాలాలకు ఎయిర్ ఫోర్స్, నేవీ దళాలు సహాయాన్ని అందచేస్తున్నాయి. చిన్న చిన్న పడవల సహాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని బయటికి తీసుకుని వస్తున్నారు. అక్కడి నుండి వారిని అర్మీ హెలిక్యాఫ్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

గతంలో ఎన్నడూ లేనంతగా కేరళాను వరదలు ముంచెత్తుతున్నాయి. 1924 తరువాత ఆ స్థాయిలో ఇప్పుడే వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున కొండచరియలు విరిగి పడుతుండడంతో పరిస్థితి దారుణంగా మారింది. నదులతో పాటుగా చిన్న వాగులు, వంకలు వందల సంఖ్యలో కనిపించే కేరళలో ఇప్పుడు అవే ప్రాణాంతకంగా తయారయ్యాయి. చిన్న చిన్న వాగులు, వంకలు కూడా ఉప్పొంగుతున్నాయి. వరదల కారణంగా కొండలు కోసుకునిపోవడం వల్ల పట్టుకోల్పోయి కొండచరియాలు పెద్ద విరిగిపడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్డు మార్గాలు మూసుకునిపోవడంతో వరదల్లో చిక్కుక్కున వారని రక్షించడం కష్టంగా మారింది.
ప్రకృతి అందాలతో కనువిందు చేసే అనేక పర్యాటక ప్రాంతాలు ఇప్పుడు కళావిహీనంగా మారాయి. మున్నార్ లాంటి ప్రాంతాలు బురదమయంగా మారాయి. పెద్ద ఎత్తున కొండచరియలు విరిగి పడడంతో పెద్ద సంఖ్యలో చెట్లు పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఎర్నాకులం లాంటి ప్రాంతాల్లో తేయాకు తోటలకు భారీగా నష్టం వాటిల్లింది. కొబ్బరి చెట్లు, అరిటి తోటలు ధ్వంసం అయ్యాయి. సుగంధ ద్రవ్యాల చెట్లు నాశనం అయ్యాయి.ప్రఖ్యాత శబరిమల ఆలయంతో బయటి ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి. శబరీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దేవాలయం చుట్టుతా నీరు ప్రవహిస్తోంది.
వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళను అన్నిరకాలుగా ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోడి ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో మాట్లాడిన ఆయన వరద పరిస్థితిని, నష్టాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అండగా నిలుస్తుందన్నారు.
flood situation worsens in Kerala,35 more NDRF teams to kerala,landslips, heavy rain, rising water level under bridges.

అటల్ బిహారీ వాజ్ పేయి జీవిత విశేషాలు


భరతమాత మొడలోని కౌస్థుబం-ఈ భారత రత్నం

Wanna Share it with loved ones?