కేరళ వరదలకు కారణం- దేవుడి శాపమా..? మనిషి పాపమా…?

కేరళ వరదలు – మతం రంగు … కేరళను వరదలు అతలాకుతలం చేశాయి. వరద ముంచెత్తి ఉళ్లకు ఊళ్లు మునిగిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో బ్రతుకు జీవుడా అంటూ ఇళ్లు, వాకిళ్లు వదిలి సహాయక కేంద్రాల్లో లక్షల మంది తలదాచుకుంటున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీరు లేక అల్లాడుతున్న వాళ్లు కూడా లక్షల సంఖ్యలోనే ఉన్నారు. కేరళ వరదలు రాజకీయ రంగు దాటుకుని మతం రంగు పులుపుకుంటున్నాయి. సామాజిక మాధ్యమాల్లో కేరళ వరదలపై జరుగుతున్న చర్చ దారుణంగా ఉంది. బాధితులను ఆదుకునేందుకు, వారికి సహాయం అందించేందుకు కావాల్సిన ఏర్పాట్ల పై జరగాల్సిన చర్చ పక్కదారి పట్టింది. వరదలకు, మతాలకు లంకెకట్టి కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు దారుణంగా ఉంటున్నాయి. దేవుడి స్వంత రాష్ట్రాంగా చెప్పుకునే కేరళను ఏ దేవుడు శపించాడు, ఏ దేవుడు కాపాడాడు అనే అంశంపై జరుగుతున్న వివాదాలు రచ్చకెక్కాయి.
కేరళలో హింధువులు, ముస్లీంలు, క్రిష్టియన్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మూడు మతాలకు అయా జిల్లాల్లో గట్టిపట్టుంది. ఇప్పుడు కేరళలో మతాల అధారంగా రచ్చ జరుగుతోంది. హింధువులు ఇప్పటికే చాలా మంది క్రైస్తవులుగా మారారని ఇంకా చాలా మంది మతం మారనందువల్లే ఏసు ప్రభువుకు కోపం వచ్చి కేరళపై విరుచుకని పడ్డాడని కొంత మంది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇటు శబరిమల ఆలయయంలో స్ర్తీల ప్రవేశానికి సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వడం మహిళల ప్రవేశం పై తమకు అభ్యంతరం లేదని కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టులో చెప్పడం వల్లే అయ్యప్ప ఆగ్రహానికి కేరళ ప్రజలు బలయ్యారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. కేరళలో వరదలు మరింత ముంచెత్తకుండా అల్లానే కాపాడారనేది మరికొందరి వాదన.
అటు వరదల బాధితుల సహాయం విషయంలో కూడా మతం పెద్ద ప్రచారాంశం అయింది. ఆర్ఎస్ఎస్ కు చెందిన వారు సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారంటూ ఒక వర్గం ప్రచారం చేస్తోంది. మరో వర్గం మాత్రం మిషనరీలు మాత్రమే సహాయక కార్యక్రకలాపాల్లో పాల్గొంటున్నారని చెప్తున్నారు. కాదు.. కాదు తమ వర్గం వారు మాత్రమే పెద్ద ఎత్తున నిధులను సమకూరుస్తురని అంటున్నారు. మొత్తం మీద సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ అనారోగ్యకర చర్చ పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇటుంటి వ్యాఖ్యలు కొంతమంది మాత్రమే చేస్తుండగా పెద్ద సంఖ్యలో ప్రజలు మాత్రం కుల,మతాలకు అతీతంగా సహాయం జరగాలని, ఇటువంటి సమంయోల అనుచిత వ్యాఖ్యలు చేయవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆపదలో ఉన్న ప్రజలను సహాయక బృందాలు వారి మతం లేదా కులం ఆధారంగా సహాయం చేయడం లేదు. సైనిక, సహాయక బృందాలు అందర్ని కాపాడుతున్నాయి. కేవలం ఒక వర్గానికి మాత్రమే తాము సహాయం చేస్తామని ఆర్ఎస్ఎస్ కానీ , మిషనరీలు కానీ, ముస్లీం మత సంస్థలు కానీ ఎక్కడా ప్రకటించలేదు. అవసరం అయిన అన్ని వర్గాలను వారు ఆదుకుని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కానీ కొంత మంది చేస్తున్న అనుచిత ప్రచారం వల్ల ఎవరికీ ఎటువంటి తోడ్పాటు అందడం లేదు కానీ నష్టం మాత్రం జరుగుతోందనడంలో ఎటువంటి సందేహం లేదు. దేవుడి పై జరుగుతున్న ఇటువంటి చర్చను అన్ని మత ప్రముఖులు తప్పుబడుతున్నారు. కొంతమంది అనాలోచిత వ్యాఖ్యల వల్లే అవసరం వివాదాలు రేగుతున్నాయనేది వారి భావన.
ఈ ప్రకృతి విలయానికి మానవుల తప్పిదమే కారణమని పర్యావరణ వేత్తలు చెప్తున్నారు. విచ్చలవిడిగా అడవుల నరకివేత, గనుల తవ్వకం, ఇసుల తరలింపు వంటి కారణాలే ప్రకృతి విలయానికి కారణమని దీనితో పాటుగా నదీ ప్రవాహాక ప్రాంతల ఆక్రమణ వల్ల కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగిందని వారు తెలిపారు. అయితే ఇవన్నీ పట్టించుకోని కొంత మాత్రం నెపం దేవుడిమీద వేసి తప్పించుకుంటున్నారు.

అపార నష్టం కలిగిస్తున్న కేరళా వరదలు
Kerala