కేజ్రీవాల్ పై తిరుగుబాటు..?

ఢిల్లీ పురపాలక సంఘంలో చావు దెబ్బతిన్న ఆమ్ ఆద్మీపార్టీలో అంతర్గత పోరు మొదలైంది. పార్టీ దారుణంగా దెబ్బతినడానికి కారణాలను అన్వేషించాలంటూ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ రాష్ట్రంలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఆప్ ఇంత కొద్ది కాలంలోనే ఇంత దారుణమైన స్థితికి చేరడానికి గల కారణాలను విశ్లేషించాలంటూ ఎమ్మెల్యేల నుండి డిమాండ్ వస్తోంది. ఈ క్రమంలో ఏవీఎం ల వల్లే పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతినిందన్న పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పార్టీలోని సగం మంది ఎమ్మెల్యేలు విభేదిస్తున్నారు. పార్టీ ఓటమికి కారణాలు తెలుసుకోకుండా ఈవీఎంల వల్లే ఓడామంటూ ప్రకటనలు చేయడం సరికాదని వారు ప్రకటించారు. పార్టీలోని ఎమ్మెల్యేలే బహిరంగంగా పార్టీ అధినేత వ్యాక్యలను తప్పుబట్టడంతో పార్టీలోని లుకలుకలు ఒక్కసారిగా బహిర్గతం అయ్యాయి.
అరవింద్ కేజ్రీవాల్ వ్యవహార శైలిపై పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. ఢిల్లీలో పానను పక్కనపెట్టిన కేజ్రీవాల్ కేంద్రంతో యుద్ధానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనేది పార్టీ వర్గాల ఆరోపణ. అరవింద కేజ్రీవాల్ తననితాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ నేత వ్యాక్యానించారు. పార్టీ వ్యవహారాలను గురించి కేజ్రీవాల్ పట్టించుకుని చాలాకాలమైందని ఇటీవల కాలంలో పంజాబ్, గోవాల్లో ఎన్నికలు ఉండడంతో అక్కడి వ్యవహారాల పైనే కేజ్రీవాల్ పూర్తిగా సమయం కేటాయించి ఢిల్లీని పట్టించుకోవడం మానేశారని ఆయన వాపోయారు. పార్టీలో ఇప్పటికే అసంతృప్తి తీవ్రస్థాయిలో ఉందని ఇది మరింత తీవ్ర అయ్యే అవకాశం లేకపోలేదని చేప్తున్నారు.
ఇప్పటికే పార్టీలోని 50శాతం మంది ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా గళమెత్తాగా మరికొంత మంది అదేదారిలో ఉన్నారు. కేజ్రీవాల్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు బహిరంగంగానే పార్టీ అధినేతపై తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. పార్టీ ఓటమికి కారణాలను తెలుసుకోకుండా ఈవీఎంలపై నెపాన్ని నెట్టివేసి తప్పించుకునే ప్రయత్నం చేయండం దారుణమని వారంటున్నారు. మొత్తం మీద ఆమ్ ఆద్మీ పార్టీలో అధినేత అసంతృప్తి జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *