మూడో ఫ్రంట్ దిశగా- దూకుడు పెంచిన కేసీఆర్

బీజేపీ-కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ ఏర్పాటు ఏర్పాటుకు నడుంబింగినచి తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ దిశగా మరింత దూకుడును పెంచారు. బీజేపీ-కాంగ్రెస్ లు దేశానికి చేసింది ఏమీలేదని అధికారంలో ఉండికూడా దేశాన్ని సమర్థంగా నడిపించలేకపోయారంటూ ధ్వజమెత్తికి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా పలు పార్టీలు, సంఘాల నుండి మద్దతు లభించడంతో కేసీఆర్ మరింత ఉత్సాహాంగా తన కార్యాచరణ ప్రణాళికు పదునుపెడుతున్నారు. దేశంలోని స్థితిగతులపై ఇప్పటికే ఓ అంచానా ఉన్నప్పటికీ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలుసుకునేందుకు కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటుగా దేశంలోని ముఖ్యనగరాలు, పట్టణాల్లో పర్యటించి ప్రముఖల సూచనలు, సలహాలను తీసుకోవాలనేది కేసీఆర్ ఆలోచన.
ఏ ప్రభుత్వాలు ఉన్నా పరిపాలనలో కీలకంగా వ్యవహరించేది మాత్రం సివిల్ సర్వీసులకు చెందిన అధికారులదే. దేశంలోని ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రణాళికల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను గురించి తెలుసుకునేందుకు విశ్రాంత సివిల్ సర్వీస్ అధికారులతో కేసీఆర్ భీటే అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరితో పాటుగా జర్నలిస్టులు, మేధావులు, రజయితలు, మాజీ సైనిక అధికారులను కూడా ఆయన కలుసుకనేందుకు ప్రణాలు రచించుకున్నారు.
ప్రస్తుతం దేశంలో బీజేపీ పాలపట్ల ప్రజల్లో పూర్తిగా సంతృత్పి లేదని అదే సమయంలో తిరిగి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించేందుకు కూడా ప్రజలు సిద్ధంగా లేరని తెలుసుకున్న కేసీఆర్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. భావసారూప్య పార్టీలతోనే, వ్యక్తులనూ కలుపుకుంటే దేశవ్యాప్తంగా మూడో ఫ్రంట్ ఏర్పాటుకు పురుడుపోయాడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. పనిలో పనిగా రాష్ట్రాలపై కేంద్ర పెత్తనాన్ని కూడా కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు ఫెడరల్ స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తిస్తున్నాయంటూ ధ్వజమెత్తిన కేసీఆర్ రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకుంటున్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *