చంద్రబాబుకు కేసీఆర్ ఇచ్చే రిటర్న గిఫ్ట్ అదేనా…?

0
101

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలంగాణ సీఎం కేసీర్ రిటన్ గిఫ్ట్…. ఏపీ ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశంగా చంద్రబాబు నాయుడు ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ లు కుమ్మక్కయి తనను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుని పడ్డారు. ఏపీలో ఎన్నికల ప్రచారంలో ఇదో ప్రధాన అంశంగా ప్రచారం సాగింది. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తరువాత మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. చంద్రబాబు ఊహించని రీతిలో కేసీఆర్ రిటన్ గిఫ్ట్ ఉంటుందని ఇందుకు చాలా రోజుల ముందు నుండే సన్నాహాలు జరుగుతున్నాయని ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత దీనికి సంబంధించిన ఫలితాలు కనిపిస్తాయనే ప్రచారం సాగుతోంది.
ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం వ్యతిరేకంగా వచ్చినా రిటర్న్ గిఫ్ట్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందని, అదే ఫలితాలు అనుకూలంగా వచ్చినా కూడా చంద్రబాబుకు పార్టీలో భారీ ఎదురుదెబ్బ తలగడం ఖాయమని విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలుగుదేశం పార్టీ అధినేత వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్న కొంత మంది ఆ పార్టీ నేతలు ఇప్పటికే కేసీఆర్ తో టచ్ లోకి వచ్చారనే ప్రచారం జరుగుతోంది. గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించి ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్న నేతల ద్వారా ఏపీలోని తెలుగుదేశం పార్టీ నేతలతో టీఆర్ఎస్ సంప్రదింపులు జరుపుతోందని తద్వారా పార్టీలో భారీ చీలికకు రంగం సిద్ధమవుతున్నట్టు టీఆర్ఎస్ అంతరంగిక వర్గాలు చెప్తున్నాయి.
ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ప్రజల తీర్పు ఉంటే ఈప్రక్రియ సులువు అవుతుందని అదే ఆ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం కొంచెం కష్టమయినా అనుకున్న ఫలితాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయనే ధీమాతో ఆ వర్గాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీని అన్నీ తానై చంద్రబాబు నడిపిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీలోని కొందరు సీనియర్లను సైతం కొన్ని కారణాల వల్ల ఇటీవల కాలంలో పక్కన పెట్టారు. ఆ నాయకులు బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేయకున్నా లోలోపన పార్టీ అధినేత తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుని తెలుగుదేశం పార్టీని భారిగా దెబ్బకొట్టాలనేది తెలంగాణ ముఖ్యమంత్రి వ్యూహంమని ఆయన అంతరంగిక వర్గాలు చెప్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా అధికార పక్షానికి వ్యతిరేకంగానే ప్రజలు తీర్పు ఉండబోతోందని గట్టిగా నమ్ముతున్న కేసీఆర్ ఇదే అదనుగా టీడీపీని మరింత గట్టిగా దెబ్బకొట్టాలనే వ్యూహాంతో ఉన్నట్టు కనిపిస్తోంది. గత కొద్ది కాలంగా ఈ వ్యవహారంపై కొన్ని వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే తొలిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బహిరంగంగానే ఈ అంశంపై ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎటూ ముఖ్యమంత్రి పదవి పోతుందనే నిర్ణయానికి వచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షపదవిని కాపాడుకునేందుకు తాంటాలు పడుతున్నారంటూ శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ గమనార్హం.
ఏపీ ఎన్నికల్లో జగన్ కు కేసీఆర్ అన్నిరకాలుగా సహాయసహకరాలు అందిచారనే ప్రచారంతో పాటుగా ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు పదే పదే ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దాన్నే రిటర్న్ గిఫ్ట్ గా చంద్రబాబు నాయుడు భావించాడని అయితే ఆయన ఊహించని విధంగా కేసీఆర్ పక్కా పథకం ప్రకారం పావులు కదుపుతున్నారని కేసీఆర్ సన్నిహిత వర్గాల నుండి పక్కా సమాచారం అందుతోంది.

Wanna Share it with loved ones?