కొంగర్ కలాన్ సభలో కేసీఆర్ ముందస్తు సంకేతాలు

kcr on early elections హైదరాబాద్ నగర శివార్లలోని కొంగర కలాన్ లో జరిగిన ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలు జరుగుతాయని సూత్రప్రాయంగా తెలిపారు. ముందస్తు ఎన్నికలను గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయని చెప్పిన ఆయన తెలంగాణ ప్రజలకు ఏది మంచిదయితే అది చేయాలంటూ మంత్రివర్గ సహచరులు చెప్పారన్నారు. త్వరలోనే ఎన్నికల మ్యానిఫెస్టోతో టీఆర్ఎస్ ప్రజల ముందుకు వస్తుందని చెప్పడం ద్వారా ముందస్తు ఎన్నికలను గురించి సీఎం కేసీఆర్ ప్రకటించినట్టయింది. అయితే ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన మాత్రం ముఖ్యమంత్రి చేయలేదు. పలు విషయాలపై విపులంగా మాట్లాడారు. ఆయన ప్రసంగంలోని ముఖ్య అంశాలు.
• ప్రపంచమే నివ్వరపోయే విధంగా సభను నిర్వహించుకుంటున్నాం.
• రాష్ట్రంలోని నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చారు.
• కరెంటు ఛార్జీలు తగ్గించాలంటూ 2000 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రికి లేఖరాసినా పట్టించుకోలేదు.
• తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసమే నాటి ముఖ్యమంత్రిని కరెంటు ఛార్జీలు తగ్గించాల్సిందిగా డిమాండ్ చేశాను.
• 2000 సంవత్సరంలో నా వెంట పిడికెడు మంది మాత్రమే ఉన్నారు.
• తెలంగాణ కోసం రాజకీయ ఉధ్యమం ప్రారంభించాలనే నాడే నిర్ణయం తీసుకోన్నాం.
• నాటి నుండి తెలంగాణ సాధించుకునేంతవరకు ఎన్నో త్యాగాలు చేయాల్సి వచ్చింది.
• తెలంగాణలోని ప్రతీ వ్యక్తి ఉధ్యమంలో పాల్గొన్నారు.
• ఢిల్లీ పెద్దలు ఇచ్చిన మాట వెనక్కి తీకున్నారు.
• తెలంగాణ రాదంటూ అవహేళన చేసినా ఎక్కడా భయపడకుండా ముందుకు సాగాం.
• ప్రాణం పోయిన ఉధ్యమ బాటవీడనంటూ జనదృశ్యంలో పార్టీ ఏర్పాటయింది.
• అనేక పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
• తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం కోసం టీఆర్ఎన్ ఎన్నికల్లో పోటీ చేసింది.
• ప్రజల మద్దతుతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది.
• అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సమస్యలు ఎదుర్కోవాల్సివచ్చింది.
• కొత్త సంసారం లాగా అనేక ఉబ్బందులు పడుతూ ఒక్కో సమస్యను అధికమిస్తూ వచ్చాం.
• తెలంగాణ రాక ముందే చెరువులను బాగుచేయాలని నిర్ణయించుకున్నాం.
• ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మేధావుల ఆలోచనలో పుట్టిందే మిషన్ కాకితీయ ప్రాజెక్టు.
• తెలంగాణ వస్తే రాష్ట్రం చీకటిమయం అవుతుందని కొందరు ప్రచారం చేశారు.
• ఇప్పుడు రైతులకు ఉచితంగా 24 గంటలు విద్యుత్ ఇస్తున్న దేశంలో తెలంగాణ ఒక్కటే.
• సమైఖ్య పాలనలో తెలంగాణలో జీవన విధ్వంసం జరిగింది.
• కులవృత్తులు చిధ్రం అయ్యాయి.
• చేనేత కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నాడు తలెత్తాయి.
• కులవృత్తులను ఆదుకునేందుకు అనేక చర్యలను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది.
• పేద కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను గుర్తించే కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టాం.
• ఎలక్షన్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటుగా 76 అంశాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది.
• తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతీ పనిని చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది.
• నాయి బ్రాహ్మణులకు ఇచ్చే కరెంటు ధరలను బాగా తగ్గించాం.
• సాఫ్ట్ వేర్ ఉద్యోగం మాత్రమే కాదు గొర్రెల పెంపకం కూడా వృత్తే
• కోటీ ఎకరాలకు నీళ్లు ఇస్తానంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం.
• రైతుల కోసం రైతు బంధు పథకాన్ని తీసుకుని వచ్చాం.
• రైతులకు పెట్టుబడిని అందిస్తున్నా రాష్ట్రం తెలంగాణ ఒక్కటే.
• తెలంగాణ అభివృద్ది కోసం 425 కార్యక్రమాలు చేపట్టాం.
• రైతులను ఆదుకునేందుకు రైతు భీమా పథకాన్ని చేపట్టాం.
• ప్రాజెక్టులతో ముందుకు పోతున్నాం.
• మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు.
• ప్రతీ ఇంటికి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని చెప్పిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే.
• భూ రికార్డులను ప్రక్షాళన చేశాం.
• చిత్తశుద్ది చేస్తే ఫలితాలు ఎట్లా ఉంటాయో నిరూపించగలిగాం.
• ఇసుక మీద కొందరు మాట్లాడుతున్న మాటలు అవివేకంగా ఉన్నాయి.
• ఇసుక మీద గతంలో 09 కోట్ల లాభం వస్తే ఇప్పుడు 1900 వందల కోట్లు.
• మైనార్టీల సంక్షేమం కోసం చిత్తుశుద్దితో పనిచేస్తున్నాం.
• తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే కనిపిస్తోంది.
• ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలే చూస్తున్నారు.
• కోటి ఎకరాల్లో ఆకుపచ్చ తెలంగాణా లక్ష్యంగా పనిచేస్తున్నాం.
• 22వేల గ్రామాలకు మంచినీటిని అందిస్తున్నాం…1300 గ్రామాలకు త్వరలో అందిస్తాం.
• తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.

పోరాటానికి ముందే పారిపోయిన విపక్షాలు:కేటీఆర్


కమలం నేతలకు ముందస్తు గుబులు