రాష్ట్ర ప్రయోజనాల కోసమే అసెంబ్లీ రద్దు: కేసీఆర్

0
72

రాష్ట్ర ప్రయోజనాల కోసమే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధమైనట్టు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేక కేసీఆర్ తెలిపారు. అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని గవర్నర్ నరసింహన్ కు తెలిపిన తరువాత ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం టీఆర్ఎస్ ఎన్నో త్యాగాలు చేసిందని కేసీఆర్ చెప్పారు. అవసరం అయిన ప్రతీసారి పదవులకు రాజీనామాలు చేసిన ఘనత తమ పార్టీ ఎమ్మెల్యేలదేనని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ కోసం పదవులను త్యాగాలు చేయడం తమకు కొత్త కాదని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు కూడా అదే తరహాలో అసెంబ్లీ రద్దు చేశామన్నారు. ఏ నిర్ణయం అయినా టీఆర్ఎస్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
అసెంబ్లీని రద్దు చేస్తామంటే ఒక్క ఎమ్మెల్యే కూడా అడ్డుచెప్పలేదన్నారు. అందుకోసమే సిట్టింగ్ లకు అందరికీ టికెట్లు ఇస్తున్నామన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం లేదని, ఐదుగురి సీట్లను పెండింగ్ లో ఉంచినట్టు ఆయన వివరించారు. సీట్లు నిరాకరించిన వారిలో చెన్నూరు ఎమ్మెల్యే ఓదేలు, ఆందోల్ ఎమ్మెల్యే బాబు మోహన్ లు ఉన్నారు. వారి సేవలను పార్టీ కోసం ఉపయోగించుకుంటామని కేసీఆర్ చెప్పారు.

Wanna Share it with loved ones?