నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం:కేసీఆర్

తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. గుజరాత్ ఎన్నికల తరువాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నియోజకవర్గాల పునర్వీభజన, అసెంబ్లీ సీట్ల పెరుగుదల పై వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సీట్ల పెంపు వ్యవహారం త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు సీఎం పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 99 శాతం మంది సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వనున్నట్టు సీఎం స్పష్టం చేశారు. ఎవరూ ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అందరికీ టికెట్లు వస్తాయని కేసీఆర్ భరోసా ఇచ్చార. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ బారీ విజయం సాధిచండం ఖాయమని చెప్పారు. సర్వేలన్నీ ఇదే విషయాన్ని చెప్తున్నాయని ప్రస్తుత నియోజకవర్గాల ప్రకారం ఎన్నికలు జరిగితే రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ 96 నుండి 104 సీట్లను కైవసం చేసుకుంటుందని సర్వేలే వెల్లడయిందన్నారు.
పార్టీలో వర్గ రాజకీయాలకు చోటులేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పార్టీలో వర్గాలను ప్రోత్సహించేది లేదన్నారు. ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో కలుగచేసుకోవద్దని ఎమ్మెల్సీలను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ విప్ లు సమన్వయంతో వ్యవహరించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *