జనవరి కల్లా సమగ్ర భూసర్వే పూర్తి:కేసీఆర్

0
71

తెలంగాణ వ్యాప్తంగా భూ సమగ్ర సర్వేను 2018 జనవరి నాటికల్లా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశించారు. ప్రగతి భవన్ లో ఆయన జిల్లాల కలెక్టర్లు, ఉన్నాతాధికారులతో సమావేశమయ్యారు. గతంలో ఎన్నడూ నిర్వహించని విధంగా చేస్తున్న భూ సమగ్ర సర్వేను కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యతా అంశంగా తీసుకోవాలని, రానున్న మూడు నెలలు దీనిపైనే ప్రధానంగా దృష్టిసారించాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం భూమి ఎవరి ఆధీనంలో ఉంది. దాని యజమాని ఎవరు అనే దానిపై పూర్తిగా సర్వే జరిపి దానికి సంబంధించిన వివరాలను గ్రామంలోని పంచాయితీ కార్యాలయాలు లేదా స్కూల్ భవనాల్లో కానీ అంటించాలని సీఎం ఆదేశించారు. సమగ్ర సర్వే పూర్తయిన తరువాతనే కొత్త పాస్ పుస్తకాలను ఇవ్వాలంటూ కలెక్టర్లకు చెప్పారు.
కొత్త పాస్ పుస్తకాల ఆధారంగానే రైతులకు ప్రభుత్వం ఇచ్చే రుణాలను ఇవ్వనున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. పాస్ పుస్తకాల్లో వాడే భాష సరళంగా అందరికీ అర్థం అయ్యే విధంగా చూడాలన్నారు. సమగ్ర భూ సర్వే కోసం అవసరం అయితే తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఇందుకు అవసరమైన అధికారాలను కలెక్టర్లకు ఇస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. సమగ్ర భూ సర్వేను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేయాలని అన్నారు. ప్రస్తుతం భూములకు సంబంధించిన రికార్డులు సక్రమంగా లేవని రెవెన్యూ రికార్డుల్లో ఒకరి పేరు ఉంటే వ్యవసాయ శాఖ వద్ద రికార్డుల్లో మరొకరి పేరు ఉందని ఈ తరహా విధానానికి స్వస్తిపలకాలని కేసీఆర్ చెప్పారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here