పీలేరు లో కత్తి మహేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

0
85
కత్తి మహేష్

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కిన సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్ ను చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసున్నారు. జిల్లాలోని పీలేరు లో సోమవారం ప్రెస్ మీట్ కు హాజరయ్యేందుకు కత్తిమహేష్ ప్రయత్నించగా ఒక్కసారిగా ఆయన్ను చుట్టుముట్టిన పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. కత్తి మహేష్ ను బెంగళూరుకు తరలించినట్టుగా తెలుస్తోంది. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ ను హైదరాబాద్ పోలీసులు నగర భహిష్కరణ విధించిన సంగతి తెలిసిందే.
దీనితో కత్తి మహేష్ ను నగర పోలీసులు తన స్వస్థలం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం యర్రావారిపాళెం మండలం యల్లమందలో విడిచి పెట్టారు. అక్కడే ఉంటున్న కత్తి మహేష్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అంశానికి సంబంధించిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై నిరసన వ్యక్తం చేస్తుూ కొన్ని దళిత సంఘాలు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశానికి కత్తి మహేష్ హాజరవుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు ఆయన్ని తమ అదుపులోకి తీసుకున్నారు.
కత్తి మహేష్ విలేకర్ల సమావేశంలో పాల్గొంటే శాంతి భద్రతల సమస్యలు వచ్చే అవకాశం ఉందని భావించిన పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారు.
katti mahesh, peler, andhra pradesh, chittor.

సెల్ ఫోన్ కోసం స్నేహితుడి దారుణ హత్య


వీహెచ్ పై మండిపడుతున్న అంజన్ కుమార్ యాదవ్Wanna Share it with loved ones?