కాశ్మీర్ లో ఏం జరుగుతోంది… ఏం జరగబోతోంది…

కాశ్మీర్ లో ఏం జరుగుతోంది… జరగబోతోంది…
ఉత్కంఠగా ఎదురుచూస్తున్న యావత్ ప్రపంచం…
చకచకా మారుతున్న పరిణామాలు…
మంచుకొండల్లో నిరువు గప్పిన నిప్పు…

ఏదో జరుగుతోంది… ఇంకేదో జరగబోతోంది… ఇప్పుడు యావత్ భారతదేశంతో పాటుగా ప్రపంచ దేశాలు ఇదే మాట అంటున్నాయి. అందరి దృష్టి ఇప్పుడు కాశ్మీర్ పై కేంద్రీకృతం అయి ఉంది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో భారీగా సైనిక బలగాలు అక్కడికి కు చేరుకుంటున్నాయి. మిలటరీతో పాటుగా పారా మిలటీర బలగాలు కాశ్మీర్ లోయలో అడుగడుగునా మోహరించి ఉన్నాయి. బలగాలతో పాటుగా భారీగా ఆయుధ సంపత్తి కూడా తరలుతోంది. మోర్టార్లు, రాకెట్ లాంచర్లతో పాటుగా బోఫోర్స్ తుపాకులు కూడా ఇప్పుడు కాశ్మీర్ కు చేరుకుంటున్నాయి. యుద్ధ ట్యాంకులు కూడా తరలుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీనితో ఎదో జరగుతోందనే విషయం స్పష్టంగా కనిపిస్తున్నా ఏం జరగబోతోందని విషయం మాత్రం ప్రభుత్వం బయటికి పొక్కనీయడం లేదు దీనితో ఎవరికి వారు తమకు తోచిన విధంగా అంచానాలు వేస్తున్నారు. ఇటు సోషలు మీడియాలో దీనిపై విస్తృతంగా చర్చలు సాగుతున్నాయి.అమరాథ్ యాత్రను అర్థంతరంగా రద్దు చేయడంతో పాటుగా కాశ్మీర్ లోయలో ఉన్న పర్యాటకులను స్వస్థలాలకు వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటు శ్రీనగర్ లోని కళాశాలలకు సెలవులు ప్రకటించారు. అక్కడ చదువుకుంటున్న ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు అందాయి. స్థానికులు నిత్యావసర వస్తువులను పెద్ద సంఖ్యలో నిల్వచేసుకుంటున్నారు.
ముష్కరులను ఏరేసే భారీ ఆపరేషన్?
కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ని రద్దు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇదొక్కటే కాదని లోయ లో తిష్టవేసిన ముష్కర మూకలను సమూలంగా ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆపరేషన్ చేపడుతోందనే వార్తలు వస్తున్నాయి. జమ్ముకాశ్మీర్ లో అలజడి రేపుతున్న తీవ్రవాదులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుంకట్టిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే భారీగా ముందస్తు చర్యలుతీసుకుని కేంద్ర ప్రభుత్వం ఎటువంటి విపత్కర పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండడానికే పక్క ప్రణాళికతో వ్యవసరిస్తున్నట్టు కనిపిస్తోంది.
తీవ్రవాదుల ఎరివేతలో భాగంగా అవసరం అయితే ఎల్ఓసీ ని దాటేందుకు సైతం కేంద్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ఇందుకే ప్రజలను బంకర్లలో ఉండాలనే ఆదేశాలు కూడా జారీ చేసినట్టు ఆ వర్గాలు చెప్తున్నాయి. కేవలం ఆర్టికల్ 370 రద్దు కోసమే కేంద్ర ప్రభుత్వం ఇంత భారీ స్థాయిలో కసరత్తులు చేయడం లేదని కాశ్మీర్ అంశానికి సంబంధించి అత్యంత కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా ఉగ్రవాద ఏరివేత చర్యలను భారీ ఎత్తున చేపట్టడానికే కేంద్ర ప్రభుత్వం ఈ అసాధారణ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.కేంద్రపాలిత ప్రాంతంగా కాశ్మీర్
జమ్ము కాశ్మీర్ లను విడదీసి కాశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారనే మరో ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. కాశ్మీర్ తో పాటుగా లడాఖ్ ను కూడా కలిపి కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తారని దీని ద్వారా కాశ్మీర్ కు ప్రస్తుతం ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి దానికదే పోతుందనేది కేంద్ర ప్రభుత్వ భావనగా ఉందనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. మొత్తానికి కాశ్మీర్ అంశంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తారనే ఉత్కంఠ మాత్రం సాగుతూనే ఉంది.
వర్షాలు లేక, పంటలు పండక- దేశంలో కరవు పరిస్థితులు