కరుణానిధి కన్నుమూత

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కన్నుమూశారు. అనారోగ్యంతో గత కొద్ది రోజులుగా చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రి వర్గాలు కరుణానిధి మరణవార్తను దృవీకరించారు.సాయంత్రం 6.10గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయనకు ముగ్గురు భార్యలు పద్మావతి, దయాళు అమ్మాళ్‌, రాజత్తి అమ్మాళ్‌. వైద్య లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం ఆయన భౌతికకాయాన్ని గోపాలపురంలోని ఆయన నివాసానికి తరలించనున్నారు.
కలైంజర్ మృతి వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, డీఎంకే శ్రేణులు ఆసుపత్రి వద్దకు భారీగా తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నగరంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గోపాలపురంలోని డీఎంకే అధినేత నివాసానికి ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. ముత్తువేల్‌ కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి.1924 జూన్‌ 3న తమిళనాడులోని తిరుక్కువాలైలో ఆయన జన్మించారు. ఈవీ రామస్వామి పెరియార్‌, అన్నాదురైలతో పాటుగా ఆయన ద్రవిడ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 1957లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 33 ఏళ్ల వయస్సులో ఆయన తొలిసారిగా ఎన్నికయ్యారు. ద్రవిడ మున్నేట్ర కళగం స్థాపనలో కీలక భూమిక వహించారు. 1967లో తొలి సారిగా తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చింది. అన్నాదురై సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1969లో కన్నుమూయడంతో కరుణ పగ్గాలు అందుకున్నారు. 1957 నుంచి 2016 అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయన పోటీచేసిన ప్రతిసారీ విజయం సాధించారు. కలైంజర్ గా అభిమానులు ముద్దుగా పిల్చుకునే ఆయన 1969 నుండి 2011 మధ్యలో పలు దఫాలు ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా సేవలందించారు.
కరుణానిధి మృతితో తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. పెద్ద ఎత్తున ఆయన అభిమానులు తమ ప్రియతమనేతను కడసారిగా చూసేందుకు తరలివస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా తమిళనాడు మొత్తం భారీ భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.
డీఎంకే అధినేత మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. దేశం ఓ గొప్పను నేతను కోల్పోయిందని పలువురు తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కరుణానిధి మరణంపై సంతాపాన్ని వ్యక్తం చేశారు.
కరుణానిధి మరణంతో డీఎంకే శ్రేణులు పెద్ద దిక్కును కోల్పోయినట్టయింది. పార్టీ అధినేతగా 50 సంవత్సరాలుగా ఆయన కొనసాగుతూ వచ్చారు. పార్టీని అన్నీ తానై నడపించిన ఆయన లేని డీఎంకేను ఊహించడమే కష్టమని డీఎంకే అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
karunanidhi, tamil nadu, karunanidhi dead,

వంటపని, ఇంటి పని చేయించడం గృహహింస కాదు:బాంబే హైకోర్టు
Karunanidhi