భక్తి శ్రద్దలతో కార్తీక పౌర్ణమి…

0
70

కార్తీక పౌర్ణమిని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఉదయం నుంచే ఆలయాలు కిక్కిరిసిపోయాయి. నదుల్లో పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. సముద్ర స్నానాలు కూడా పెద్ద సంఖ్యలో చేస్తున్నారు. భక్తుల తాకిడికి ప్రముఖ ఘాట్లన్ని కిటకిట లాడుతున్నాయి. తెలుగురాష్ట్రాల్లోని అన్ని ప్రధాన దేవాలయాల్లోనూ ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. భక్తులు దేవాలయాలకు చేరుకుని దీపాలను వెలిగిస్తున్నారు. శివాలయాలతో పాటుగా విష్ణు ఆలయాలకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ముఖ్యంగా నదీ తీరాల్లో ఉన్న దేవాలయాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here