సాఫీగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

0
95
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
voter in que

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్ లకు చేరుకుని తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. కర్ణాటక అసెంబ్లీ లో మొత్తం 224 స్థానాలుండగా ప్రస్తుతం 222 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అభ్యర్థి మృతికారణంగా ఒక స్థానంలో ఎన్నిక వాయిదా పడగా పెద్ద ఎత్తున నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు కనుగొన్న రాజరాజేశ్వరి అసెంబ్లీ స్థానం ఎన్నికను ఎన్నికల సంఘ వాయిదా వేసింది. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భారీ బందోబస్తు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించారు.
ఉదయం ఏడు గంటలకే ఓటర్లు ఓటుహక్కను వినియోగించుకునేందుకు తరలివచ్చారు. మొదటిసారిగా పోలీంగ్ కేంద్రాల్లో క్యూ లైన్ల పరిస్థితిని తెలుసుకునేందుకు ఒక మొబైల్ యాప్ ను అందుబాటులోకితీసుకుని వచ్చారు. దీని వల్ల తమ పోలింగ్ కేంద్రంలో ఎంత రద్దీ ఉందన్న విషయం ఓటర్లకు తెలుస్తుంది దానికి అనుగుణంగా వారు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చే సౌకర్యం ఉంటుంది. దేశవ్యాప్తంగా కర్ణాటక ఎన్నికలు ఆశక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార కాంగ్రెస్,బీజేపీలతో పాటుగా జేడీఎస్ లు అధికారం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అయితే ప్రధానంగా కాంగ్రెస్-బీజేపీల మధ్య ప్రధానంగా పోరు జరుగుతోంది.
కర్ణాటక అసెంబ్లీ లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా తిరిగి రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. రెండు పార్టీలు రాష్ట్రాన్ని ప్రచారంతో హోరెత్తించాయి. ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు జరిపారు. భార బహిరంగ సభలను ఏర్పాటు చేసిన బీజేపీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా రాష్ట్ర మంతటా విస్తృతంగా పర్యటించారు. ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడంతో ప్రచారం రంజుగా సాగింది.
ఈ దఫా ప్రచారంలో సోషల్ మీడియా ప్రముఖ పాత్రను పోషించింది. రాజకీయ విమర్శలకు ఇది వేదికగా మారింది. సోషల్ మీడియా వేదికగా రాజకీయ విమర్శలు పరిధిలు దాటిపోయాయి. సహేతుల విమర్శలను వదిలి వ్యక్తిగత దూషణలకు దిగారు. అన్ని పార్టీలు హద్దుమీరి ప్రవర్తించాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈనెల 15 వచ్చే ఎన్నికల ఫలితాల కోసం కర్ణాటక ప్రజలతో పాటుగా దేశం యావత్తు ఎదురుచూస్తోంది. కర్ణాటక ఫలితాలు 2019 లోక్ సభ ఎన్నికలతో పాటుగా మరో మూడు రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలో జరగనున్న ఎన్నికలపై కూడా స్పష్టంగా పడే అవకాశాలు ఉండడంతో ఫలితాక కోసం అన్ని వర్గాలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాయి.
కర్ణాటక లో కాంగ్రెస్-బీజేపీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఏ పార్టీ కూడా పైకి ఎంత విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నా ఫలితాలపై పూర్తి నమ్మకంతో లేవు. రెండు పార్టీలకు మెజార్టీకి కావాల్సిన సీట్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు ఎన్నికల సర్వేలే తేలడంతో ప్రభుత్వ ఏర్పాట్లలో జేడీఎస్ కీలక పాత్రను పోషించే అవకాశాలున్నాయి.
karnataka elections, pooling, karnataka pooling, karnataka pooling, bjp, congress party, congress, karnataka congress , narendra modi, rahul gandhi.

ప్రధాని దేవాలయాల పర్యటనను ప్రసారం చేయవద్దు:ఈసీ


లో దుస్తులు విప్పించారు – లైగింకంగా వేధించారు : నీట్ విద్యార్థిని అవేదన
Karnataka_Legislative_Assembly

Wanna Share it with loved ones?