ప్రధాని దేవాలయాల పర్యటనను ప్రసారం చేయవద్దు:ఈసీ

0
71
ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ పర్యటన
prime minister in nepal

ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ పర్యటనకు సంబంధించిన వార్తలను ప్రసారం చేయవద్దని ఎన్నికల సంఘం వార్తా ఛానళ్లకు ఆదేశాలు జారీ చేసింది. నేపాల్ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి ముక్తినాథ్, పసుపతినాథ్ ఆలయాలను సందర్శించనున్నారు. కర్ణాటకలో లింగాయత్ వర్గానికి చెందిన ఓట్లను ఆకర్షించేందుకు మోడీ నేపాల్ లోని ఈ రెండు ఆలయాలను సందర్శిస్తున్నారనే విమర్శల నేపధ్యంలో ఎన్నికల సంఘం ఈ ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటకలోని లింగాయత్ లు నేపాల్ ఆలయాల్లోని దేవుని రూపంలోనే శివుడిని ఆరాధిస్తారు.
కర్ణాటకలో ఆది నుండి లింగాయత్ లు బీజేపీకి గట్టి మద్దతుదారులుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే లింగాయత్ లను మైనార్టీలను గా గుర్తిస్తూ కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం దీనిపై కేంద్రం కాలయాపన చేస్తుండడంతో లింగాయత్ లు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు పలుకుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రధాని నేపాల్ పర్యటన వెనక లింగాయత్ లను తమకు అనుకూలంగా మార్చుకునే వ్యూహం ఉందనే విమర్శల నేపధ్యంలో ప్రధాని పర్యటనకు సంబంధించిన వార్తలను ప్రసారం చేయవద్దని ఎన్నికల సంఘం ఛానళ్లకు ఆదేశాలు జారీ చేసింది.
కర్ణాటక ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను గద్దేదింపి అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ సర్వ శక్తులను ఒడ్డుతోంది. మొదట్లో బీజేపీకి అనుకూలంగా కనిపించినా క్రమంగా పరిస్థితులు మారాయి. ఒక దశలో కర్ణాకటలో అధికారంలోకి రావడం బీజేపీకి నల్లేరు మీద బండినడకగా భావించినా క్రమంగా కాంగ్రెస్ బలం పుంజుకుంది. తిరిగి అధికారంలోకి రావడం ఖాయమనే వార్తలు వచ్చాయి. వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో కాంగ్రెస్-బీజేపీ లు రెండు నువ్వానేనా అన్నట్టుగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ముందజలో ఉన్నా అధికారంలోకి వచ్చేందుకు కావాల్సిన సీట్లు గెల్చుకునే స్థితిలో లేదు.
రెండు పార్టీల మధ్య పోటాపోటీ నెలకొన్న సమయంలో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ప్రధాని నరేంద్ర మోడి దిట్ట అనే సంగతి తెలిసిందే. గుజరాత్ ఎన్నికల సమయంలోనూ ఇదే జరిగిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎన్నికల సమయంలో గుజరాత్ లోని పలు దేవాలయాను సందర్శించిన దృశ్యాలతో పాటుగా ఆయన నిర్వహించిన రోడ్ షోలను బీజేపీ వ్యూహాత్మకంగా స్థానిక టీవీల్లో పదే పదే ప్రసారం చేయించిందని దీని వల్లే ఆఖరి క్షణాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని దీని వల్లే ప్రస్తుతం మోడీ నేపాల్ పర్యటనల వివరాలను ప్రసారం చేయవద్దని ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది.
ఈ అంశాలను అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ప్రధాని నరేంద్ర మోడి నేపాల్ దేవాలయాల సందర్శనకు సంబంధించిన వార్తలను ప్రసారం చేయవద్దని టెలివిజన్ ఛానళ్లకు ఆదేశాలు జారీ చేసింది. లింగాయత్ లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాని నేపాల్ వెళ్లారనే ప్రచారాన్ని ఇటు బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. లింగాయత్ లు బీజేపీ వెంటనే ఉన్నారని కాంగ్రెస్ పెడుతున్న ప్రలోభాలను లింగాయత్ లు నమ్మే స్థితిలో లేరని బీజేపీ పేర్కొంది.
karnataka , karnataka elections, narendra modi, prime minister narendra modi, narendra modi nepal visit, modi in nepal, lingayath, lingayah religion, pasupathinath temple.

ప్రగతీ రీసార్ట్స్ హత్య కేసులో స్నేహితుడే నిందితుడు


లో దుస్తులు విప్పించారు – లైగింకంగా వేధించారు : నీట్ విద్యార్థిని అవేదన
Pashupatinath_Temple

Wanna Share it with loved ones?