కర్ణాటకలో ఎమ్మెల్యే ఖరీదు రు.100 కోట్లు?

0
69
కర్ణాటక ఎమ్మెల్యే లకు భారీ గిరాకీ పెరిగింది.
karnataka mla

కర్ణాటకలో ఎమ్మెల్యేల బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. మంగళవారం వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు ఏపార్టీకీ పూర్తి మెజార్టీ ఇవ్వకపోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. దీనితో ఎమ్మెల్యే ల బేరసారాలు జోరుగా సాగుతున్నాయని ఒక్కో ఎమ్మెల్యేకు రు.100 కోట్లు పలుకుతోందనే ఆరోపణలున్నాయి. 104 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ఆ పార్టీని అధికారంలోకి రానీయకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ తన సంపూర్ణ మద్దతును జీడేఎస్ కు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ నుండి 78 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికవగా జీడీఎస్ నుండి 38 మంది గెలుపొందారు. జేడీఎస్ నేత కుమార స్వామిని ముఖ్యమంత్రిని చేసేందుకు అంగీకరించిన కాంగ్రెస్ ఆయనకు బేషరతుగా మద్దతు ప్రకటించి ఆ మేరకు గవర్నర్ కు లేఖ రాసింది.
ఇటు బీజేపీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అన్నిరకాలు ప్రయత్నాలు చేస్తోంది. 104 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సింది 9 మంది ఎమ్మెల్యేలే కావడంతో ఫిరాయింపులపై ఆ పార్టీ దృష్టిపెట్టింది. ఇప్పటికే ఇండిపెండెంట్ అభ్యర్థి తన మద్దతు బీజేపీకేనని ప్రకటించి గవర్నర్ కు లేఖకూడా రాశారు. దీనితో బీజేపీ బలం 105కు పెరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు 113 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉండడంతో ఆదిశగా బీజేపీ పావులు కదుపుతోంది.
కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన వారిలో 8 మంది పార్టీ వర్గాలకు అందుబాటులో లేకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇందులో ఐదుగురు బీజేపీ నేత గాలి జనార్థన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అంతా తమ వెంటనే ఉన్నారంటూ చెప్తున్నప్పటికీ లోపల మాత్రం హస్తం పార్టీకి ఎక్కడలేని గుబులు పట్టుకుంది. సొంత ఎమ్మెల్యేలు చేజారనీయకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. కొంందరిని రీసార్టుకు తరలించే ప్రయత్నాలు చేస్తుండగానే ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలకు అందుబాటులో లేకుండా పోవడంతో వారు బీజేపీకి మద్దతు పలికే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇటు జేడీఎస్ ను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందనే వార్తలు వస్తున్నాయి. జేడీఎస్ నేత, కుమార స్వామి సోదరులు రేవణ్ణను బుజ్జగించి తమకు మద్దతు ప్రకటించే విధంగా దారిలోకి తీసుకుని వచ్చేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడైన రేవణ్ణకు సోదరడు కుమారస్వామికి మధ్య ఉన్న విభేదాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కమలనాధులు ప్రయత్నాలు చేస్తున్నారు. స్వయంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు రంగంలోకి దిగి ప్రభుత్వ ఏర్పాటుకు కోసం కావాల్సిన అన్నిరకాలు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ పెద్ద ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి.
తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు బీజేపీ మంత్రి పదవి ఆశచూడంతో పాటుగా 100 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధపడుతోందని కుమార స్వామి ఆరోపించారు. అధికారంలోకి రావడానికి బీజేపీ అనైతికి కార్యక్రమాలకు తెరతీస్తోందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం భారీగా డబ్బును సిద్ధం చేశారని , గాలి జనార్థన్ రెడ్డి ఇందుకు డబ్బును సమకూరుస్తుడని కుమార స్వామి ఆరోపించారు. పదవీ వ్యామోహంతో తాము కాంగ్రెస్ మద్దుతు తీసుకోవడం లేదని కర్ణాటక ప్రజలు బాగుకోసం బీజేపీని అధికారంలోకి రాకుండా చూడడం కోసమే కాంగ్రెస్ ఇచ్చిన మద్దతును స్వీకరిస్తున్నట్టు చెప్పారు.
karnataka, karnataka elections, karnataka assembly elections, karnataka, general elections, karnataka, assembly, kumaraswamy, deve gowda, congress, congress party, bjp, jds.

కర్ణాటక పీఠం ఎవరికి దక్కుతుంది..?


పడవ ప్రమాదం లో మృతులు 22 మంది
Karnataka

Wanna Share it with loved ones?